అసద్, అక్బర్ జోరు: మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో మజ్లిస్

హైదరాబాద్/ముంబై: దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు పాతబస్తీలో పట్టు నిలుపుకుంటున్న మజ్లిస్ పార్టీ త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. మజ్లిస్ పార్టీ ఇటీవలి వరకు కేవలం హైదరాబాదుకే పరిమితమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో పట్టు సాధించింది. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పోటీ చేయాలని భావించింది. ముందు ముందు ఏపీలో పార్టీని విస్తృతం చేయనున్నారు.

ఇప్పటికే కర్నాటకలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కొన్ని స్థానాలను గెలుచుకుంది. తాజాగా మహారాష్ట్రలో పోటీ చేసేందుకు సన్నద్దమవుతోంది. మరో రెండునెలల్లో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ఔరంగాబాదులో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామన్నారు.

ఆయన ఔరంగాబాద్ నగరంలోని పలు ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయమై మహారాష్ట్రలోని పార్టీ క్యాడర్‌తో చర్చిస్తున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయం ఇతర పార్టీల ప్రకటనపై ఆధారపడి ఉంటుందన్నారు. కొన్ని మతతత్వ పార్టీలకు లాభిస్తుందని సీనియర్ నేతలు చెప్పడం వల్ల తాము ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేయలేదన్నారు.

అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ

దశాబ్దాలుగా ఆల్ ఇండియా ముస్లీమన్ ఇత్తెదుల్ ముస్లీమన్ (మజ్లిస్) పార్టీ హైదరాబాదులోని పాతబస్తీలో తన సత్తాను చాటుకుంటోంది.

 అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలు పార్టీని విస్తృతపర్చేందుకు గత కొద్ది రోజులుగా ప్రణాళికలు వేస్తున్నారు.

అసద్, అక్బర్

అసద్, అక్బర్

మజ్లిస్ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాదులో గల పాతబస్తీలో మంచి పట్టు ఉంది. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో స్థానిక ఎన్నికలలో సత్తా చాటింది.

గాలిపటం

గాలిపటం

మజ్లిస్ పార్టీ గుర్తు గాలిపటం. ఆల్ ఇండియా ముస్లీమన్ ఇత్తెదుల్ ముస్లీమన్ (మజ్లిస్) పార్టీ ప్రభావం తెలంగాణలోని పాతబస్తీలో ఎక్కువగా ఉంది.

 తెలంగాణ, ఏపీ, కర్నాటక

తెలంగాణ, ఏపీ, కర్నాటక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలోని కొన్ని ప్రాంతాలలో కొంత పట్టు ఉంది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్రలో పోటీ చేసి పార్టీని మరింత విస్తృత పర్చాలనుకంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+