మీ గేదె పాలివ్వకపోయినా మాదే తప్పా ? సీఎం హిమంతకు ఓవైసీ ఘాటు కౌంటర్...
అసోం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిన్న ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని నిన్న వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ మతం వారి వల్లే రేట్లు పెరుగుతున్నాయని సీఎం స్దానంలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పందించారు.
పెరుగుతున్న కూరగాయల ధరలను ముస్లిం వ్యాపారులకు లింక్ చేస్తూ ఆరోపణలు చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బహుశా వారు తమ వ్యక్తిగత వైఫల్యాలను "మియా భాయ్"పై వేసి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ముస్లిం కూరగాయల అమ్మకందారులు కూరగాయల ధరలను పెంచుతున్నారని, అస్సామీ ప్రజలు కూరగాయలను విక్రయిస్తే, వారు ఎన్నడూ తమ ప్రజల నుండి ఎక్కువ వసూలు చేయరని హిమంత వ్యాఖ్యానించారు.

కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వ్యక్తులు ఎవరు? వారు మియా వ్యాపారులు, కూరగాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ శర్మ చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే స్ధానికంగా అస్సాంలో నివసించే బెంగాలీ ముస్లింలను మియాలుగా పేర్కొంటారు. వారిని ఉద్దేశించే హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. వారు బయటి వ్యక్తులని, అస్సామీ సంస్కృతి, భాషను వక్రీకరించడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
హిమంత వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. వారి ఇళ్లలో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి తమ ఇంట్లో గుడ్లు పెట్టకపోయినా కూడా మియా జీని నిందించేవారు దేశంలో పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. దేశంలో అలాంటి పరిస్ధితులున్నాయన్నారు. బహుశా వారు తమ వ్యక్తిగత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మియా భాయ్‌పై నిందలేస్తారన్నారు. ప్రధానికి, విదేశీ ముస్లింలకు మధ్య లోతైన స్నేహం నడుస్తోందని ఓవైసీ.. నరేంద్ర మోదీపైనా విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల్లో పర్యటిస్తున్న మోడీ.. టమాటాలు, బచ్చలికూర, బంగాళదుంపలు ఎగుమతి చేయాలని కోరాలన్నారు.












Click it and Unblock the Notifications