Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్‌లా ఉన్నాయి: నర్సుపై ఆశారాం

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కటకటాల వెనక్కి వెళ్లినా కూడా తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో నర్సుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వచ్చిన ఆయన అక్కడి నర్సుపై... 'నువ్వు వెన్నలా ఉన్నావు. నీ బుగ్గలు కశ్మీర్‌ యాపిల్స్‌లా ఉన్నాయి' అంటూ వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా, తాను యువకుడిగా మారేలా చికిత్స చేయాలని అక్కడి వైద్యులను కోరారు. తీహార్‌ జైల్లో ఉన్న ఆశారాం బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు పరిశీలనకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది.

Asaram Bapu

చికిత్స నిమిత్తం ఆశారాంను పోలీసులు శనివారం ఢిల్లీకి తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన పోలీసుల సాయంతో వీల్‌ చైర్‌లో ఆస్పత్రికి వచ్చారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆశారాం బాపు ఆరోగ్యం కూడా ఏ మాత్రం బాగా లేదు. పట్టుకుని, అతన్ని నడిపించడానికి దాదాపు డజను మంది పోలీసుల అవసరం ఏర్పడింది.

ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే అతని కోసం వీల్ చైర్ ఏర్పాటు చేశారు. పరీక్షలతో తనను వేధిస్తున్నారని ఆశారాం అంటున్నట్లు వార్తలు వచ్చాయి. అమ్మాయిపై అత్యాచారం చేశారనే ఆరోపణపై ఆశారాం బాపును పోలీసులు 2013 ఆగస్టు 31వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+