ఆశారాం కొడుకు నారాయణసాయి చెంప ఛల్లుమనిపించిన ఖైదీ
సూరత్: వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపూ కుమారుడు నారాయణ సాయికి చేదు అనుభవం ఎదురైంది. సూరత్‌లోని లాజ్‌పోర్ జైలులో ఉన్న నారాయణ సాయిని ఓ ఖైదీ చెంప ఛల్లుమనిపించాడు. ఎదురుపడి గొడవకు దిగడంతో ఖైదీ.. నారాయణ సాయిపై దాడి చేశాడు.
నారాయణ సాయి కొందరు ప్రజలతో మాట్లాడి తన బ్యారక్ వెళుతుండగా బబ్లూ పరిండా అనే ఖైదీ బయటికి వచ్చి ఏదో చెత్త బయటపడేశాడు. ఆ సమయంలో వీరిద్దరు ఎదురుపడ్డారు. వీరిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన ఖైదీ.. నారాయణ సాయిని చెంపపై కొట్టాడు. బబ్లూ కొంత దురుసు ప్రవర్తన గల వ్యక్తని, ఇంతకుముందు కూడా జైలులో ఉన్న మరో ఖైదీని చితక్కొట్టాడని పోలీసులు తెలిపారు. బబ్లూ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపుల కేసులో ఆశారాంతోపాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications