సాయిపై లైంగిక దాడి కేసు: కీలకమైన సాక్షిపై కాల్పులు

పానిపట్: ఆశారాం కుమారుడు నారాయణ సాయి లైంగిక దాడి కేసులో కీలకమైన సాక్షిపై గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు బుధవారం ఉదయం కాల్పులు జరిపారు.

నారాయణ సాయిపై నమోదైన లైంగిక దాడి కేసులో మహేంద్ర చావ్లా కీలకమైన సాక్షి. అతనిపై బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

మహేంద్ర చావ్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆశారాంపై, ఆయన కుమారుడు సాయిపై నమోదైన కేసుల్లో సాక్షులపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు.

Asaram's son Narayan Sai was shot at by some some unidentified miscreants

ఆశారాంపై నమోదైన అత్యాచారం కేసులో సాక్షిపై ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభంలో దాడి జరిగింది. జోధ్‌పూర్ కోర్టులోనే అతనిపై కత్తులతో దాడి జరిగింది.

72 ఏళ్ల ఆశారాంపై నమోదైన మరో కేసులోని నిందితులు ఇద్దరు ఇప్పటికే హత్యకు గురయ్యారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆశారం 2013 సెప్టెంబర్ నుంచి జైలులో ఉంటున్నాడు.

ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న ఆశారాం వంట మనిషి, సహాయకుడు అఖిల్ గుప్తాను జనవరి 11వ తేదీన చంపేశారు. అంతుకు ముందు ఆశారాం మరో సహాయకుడు అమృత్ ప్రజాపతిని గుజరాత్‌లో నిరుడు జూన్‌లో హత్య చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+