పాకిస్తాన్‌లో అడుగు పెట్టిన బీసీసీఐ చీఫ్
కొలంబో: ఆసియా కప్ 2023.. ఆశించిన స్థాయిలో ఆసక్తి కలిగించట్లేదు. భారత్- పాకిస్తాన్ తలపడుతున్న ఈ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతుందని భావించిన అభిమానులను నిరాశలో ముంచెత్తుతోంది. సుదీర్ఘకాలం తరువాత తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడిన మ్యాచ్.. అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఇన్నింగ్ మొత్తం రద్దయింది. దీనికి కారణం- వర్షం.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన పల్లెకెలె స్టేడియం భారీ వర్షానికి తడిచి ముద్దయింది. ఓ చిన్నపాటి చెరువును తలపించింది. దీని దెబ్బకు పాకిస్తాన్ ఇన్నింగ్ మొత్తం రద్దయింది. ఒక్క బంతి కూడా పడలేదు. టీమిండియా బ్యాటింగ్ చేస్తోన్నపపుడు పడని వర్షం.. ఆ తరువాత స్టేడియాన్ని ముంచెత్తింది.

వర్షం ఓ కారణం కాగా.. భారత్ దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వకపోవడం మరో కారణం. ఆసియా కప్ 2023 మ్యాచ్‌లన్నీ కూడా పాకిస్తాన్, శ్రీలంకల్లోనే షెడ్యూల్ అయ్యాయి. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా వాటిల్లో రెండు శ్రీలంకలోని పల్లెకెలె, పాకిస్తాన్‌లోని ముల్తాన్, లాహోర్‌లల్లో ముగిశాయి.
ప్రస్తుతం భారత్ ఆడుతున్న రెండో మ్యాచ్ పల్లెకెలెలోనే సాగుతోంది. పసికూన నేపాల్‌తో తలపడుతోంది. లీగ్ దశలో ఒకటి, సూపర్ 4 దశలో తొలి మ్యాచ్ లాహోర్‌లోనే జరగాల్సి ఉంది. లీగ్ దశ చివరి మ్యాచ్ మంగళవారం జరుగనుంది. శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు లాహోర్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీని తరువాత సూపర్ 4లో తొలి మ్యాచ్ ఇదే స్టేడియంలో ఉంటుంది.
#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla crossed the Attari–Wagah border to visit Pakistan for Asia Cup 2023 pic.twitter.com/oEot70doAq
— ANI (@ANI) September 4, 2023
లాహోర్‌లో మ్యాచ్‌ల నిర్వహణను పరిశీలించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. పాకిస్తాన్ వెళ్లారు. పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా ఈ మధ్యాహ్నం వారు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. నేరుగా లాహోర్‌కు చేరుకున్నారు.
పాకిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. లాహోర్ స్టేడియంలో ఏర్పాట్లపై ఇంకాస్సేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. శ్రీలంకలో మ్యాచ్‌ల నిర్వహణను పరిశీలించామని, ఇక పాకిస్తాన్‌లో సమీక్ష నిర్వహించాల్సి ఉందని రోజర్ బిన్నీ తెలిపారు.












Click it and Unblock the Notifications