బెంగళూరులో అదరగొడుతున్న ఎయిర్ షో .. రెండో రోజు కూడా అదుర్స్

ఆసియా లోనే బిగ్గెస్ట్ ఎయిర్ షో ఇండియాలో కొనసాగుతోంది. భారతో పాటు పలు దేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే ఈ షోకి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ వేదికైంది. 'ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్' అనే థీమ్‌తో ఈ ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. 14 వ తేదీ వరకు ఈ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్‌ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్‌ షోలు జరగ్గా... ఇది 15వ ఎయిర్‌ షో. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు.

ప్రపంచ దేశాల యుద్ద విమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అలానే ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ షో చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు, పలువురు ప్రముఖులు బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీసారి బెంగళూరు లోనే ఈ ఎయిర్‌ షో జరుగుతుండగా.. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా కేంద్రం ఏర్పాట్లు చేసింది.

Asia s biggest air show continues on the second day as well in Bengaluru

ఎన్ని రోజులు అంటే..

ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్‌షోలో 27 దేశాల రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు పాల్గొననున్నారు. 15 దేశాల రక్షణ, సేవా రంగాలు అధినేతలు, 12 దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. అలాగే మొత్తం 80 దేశాలకు చెందిన ప్రతినిథులు తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్ంచనున్నారు. అయితే ప్రపంచ దేశాల సామర్థ్యంతో పోటీ పడేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత రక్షణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఎవరెవరు పాల్గొంటున్నారు అంటే..

మరోవైపు 150 విదేశీ సంస్థలు సహా 900కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. రెండేళ్ల కిందట 2023లో జరిగిన వైమానిక ప్రదర్శనలో 809 సంస్థలు సహా వ్యాపారవేత్తలు పాల్గొనగా.. 7 లక్షల మందికిపైగా సందర్శకులు ప్రదర్శను తిలకించారు. ఇక ప్రదర్శనలో మొదటి మూడు రోజులు వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలను అనుమతించనున్నారు.

మరో మహా కుంభ్..

భారత్‌లో ఒక వైపు మహా కుంభ్ జరుగుతోందని.. ఏరో ఇండియా రూపంలో మరో మహా కుంభ్ బెంగుళూరులో జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే ప్రయాగ్‌రాజ్.. ఆత్మపరిశీలన కాగా, ఇక్కడ సృజనాత్మకత, పరిశీలన కోసమని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల సామర్థ్యం రూ.1.6 లక్షల కోట్లకు, ఎగుమతులను రూ.30వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. గతంలో జరిగిన ఎయిర్ ఇండియా నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ ఇండియాకు చాలా పురోగతి సాధించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+