నీ రేటెంత అని అడిగిన పోకిరీలను పట్టించిన మోడల్
ముంబై: తన రేటును అడిగిన యువకులను ఓ మోడల్ పోలీసులకు పట్టించిన సంఘటన ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన మోడల్ పూర్ణిమ.. బాంద్రాలోని బస్టాండు బెంచీ పైన కూర్చుంది. ఈ సందర్ఙంగా ఇద్దరు బాక్సర్లు వచ్చి వేధించారు.
ఒక రోజు రాత్రి తమతో గడిపేందుకు కావాలని, రేటు ఎంత అని అడిగారు. వారి మాటలతో భయాంతోళనకు గురైన మోడల్ అరిచింది. దీంతో వారు పారిపోయారు. వారి పారిపోతుండటాన్ని గమనించిన మోడల్ వెంబడించింది. అనంతరం పోలీసులకు పట్టించింది.
నటి కావాలన్న కోరికతో ఆరేళ్ల నుంచి మోడల్‌గా పని చేస్తూ... కువైట్, దుబాయ్, యూఏఈ తదితర దేశాల్లో జమ్మూకు చెందిన పూర్ణిమ రాణిస్తోంది. గతంలో నార్త్ ఇండియా టీన్ క్వీన్ అవార్డు లభించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసిన మ్యూజిక్ వీడియోల్లో నటించి పేరు తెచ్చుకుంది.
అవకాశాల కోసం ముంబైలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల రాత్రి 10:30 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ.. అలసిపోయి కూర్చుంది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడ చాలామంది కూడా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు.

సాయం కావాలా అని అడిగాడు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. పూర్ణిమ భయపడింది. అతను మాట్లాడుతూ... తనతో రాత్రి గడపాలని, నీ రేటు ఎంత అని అడిగాడు. పూర్ణిమ సాయం కోసం కేకలు వేసింది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.
వారు ఆటోలో పారిపోతుండటంతో.. ఆమె మరో ఆటోలో వారిని అనుసరించింది. పోకిరీలు వెళ్తున్న ఆటో సెయింట్ ఆండ్ర్యూస్ చర్చ్ రోడ్‌లోకి ప్రవేశించగానే.. అక్కడ పోలీసు నాకాబందీ జరుగుతోందని గమనించిన పూర్ణిమ, పోలీసులకు విషయం తెలిపింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications