ఫేస్‌బుక్ ఖాతా డిలీట్ చేయమంటే.. ఉరివేసున్న యువతి

బెంగళూరు: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రభావం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందుకు ఈ ఘటన గమనిస్తే మనకు అర్థమవుతుంది. తనను తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించాలని తన తల్లి మందలించిందనే కోపంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 9వ తరగతి చదువుతున్న తన కూతురు(13) ఎక్కువ సమయాన్ని ఫేస్‌బుక్ ఖాతా చూసేందుకే కేటాయించడంతో ఆమె తల్లి మోహన తీవ్ర ఆగ్రహానికి గురైంది. తాను బయటకు వెళ్లి వచ్చేలోగా ఫేస్‌బుక్ ఖాతాను తొలగించాలని తన కూతురును మందలించింది. ఆ తర్వాత మధ్యాహ్నం మోహన ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు ఎంతకూ తీయకపోవడంతో పొరుగింటి వారి సహాయంతో తలుపులు తెరిచింది.

Asked to delete Facebook account, girl hangs herself

తన కూతురు గదికి వెళ్లి చూడగా ఆమె సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసింది. అతడి సహాయంతో తన కూతురును దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. కూతురు ఆత్మహత్యతో మోహన తీవ్ర ఆవేదనకు గురైంది. ఇంత చిన్న విషయానికే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడుతుందని అనుకోలేదని విలపించింది.

బుధవారం ఉదయం 9.30గంటలకు తన భర్త విధుల నిమిత్తం బయటికి వెళ్లారని, తన పెద్ద కొడుకు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లాడని తెలిపింది. ఇంత చిన్న వయస్సులోనే ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుని, ఫేస్‌బుక్‌లో ఎక్కువ సమయం కేటాయించడంతో తాను తన కూతురును మందలించానని మోహన తెలిపింది. ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేయాలని కోరినట్లు చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోహన స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+