Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!

లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. మోడీ సర్కిల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు.. గరోత్ (ఝాన్సీ) ఎమ్మెల్యే జవహర్ రాజ్ పుత్ కుమారుడి కారు ఆపారు. రిజిస్ట్రేషన్ పేపర్లు చూయించాలని అడగడంతో సదరు ఎమ్మెల్యే కొడుకు రాహుల్ రాజ్ పుత్ రెచ్చిపోయాడు.

ఎమ్మెల్యే కొడుకునంటూ.. తనను కారు పేపర్లు అడిగే దమ్ముందా అంటూ వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ ఆ పోలీస్ పేపర్లు చూపించాలని పట్టుబట్టారు. దాంతో ఆగ్రహానికి గురైన రాహుల్ అతడి చెంప చెళ్లుమనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదలావుంటే పోలీస్ పై చేయి చేసుకోవడంతో.. రాహుల్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Asked for papers of unnumbered car son of UP BJP lawmaker slaps cop

తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే సదరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పీఎస్ కు చేరుకున్నారు. పోలీసే తమ వాడిపై దాడి చేశాడని ప్లేట్ ఫిరాయించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు పోలీసులు, ఎమ్మెల్యే మధ్య చర్చలు జరగడంతో రాహుల్ ను విడిచిపెట్టారు. అయితే ఝాన్సీ ఎస్పీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+