Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పైలట్ అవుదామని వెళ్లి ... మృత్యు ఒడిలోకి .. న్యూజిలాండ్ కాల్పుల్లో మరొక హైదరాబాదీ మృతి

హైదరాబాద్ : పైలట్ కావాలనే ఆ యువకుడి ఆకాంక్షను శ్వేతజాతియుడి జాత్యాంహకారం బలితీసుకుంది. ఆ యువకుడి ఆశలను మానవమృగం నిర్దాక్ష్యిణంగా చిదిమిమేసింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో దుండుగులు జరిపిన కాల్పుల్లో 50 మంది ఆసువులు బాశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన మరోకరిని గుర్తించారు.

పైలట్ అవుదామని వెళ్లి ...

పైలట్ అవుదామని వెళ్లి ...

హైదరాబాద్‌లోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన ఒజైర్ ఖదీర్ (25) పైలట్ కోర్సు చదివేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. క్రైస్ట్ చర్చిలోని పైలట్ అయ్యేందుకు కమర్షియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎప్పటిలాగే గత శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లాడు. కానీ శ్వేత జాత్యాంహకారం రూపంలో మృత్యువు కదలిరావడంతో .. తూటాలకు బలయ్యాడు. మసీదులో కాల్పులు జరిపిన తర్వాత ఖదీర్ పేరు మృతుల, క్షతగాత్రుల జాబితాలో లేదు. ఆ తర్వాతే ఖదీర్ కూడా చనిపోయినట్టు నిర్ధారించారు.

అన్నే ప్రేరణగా ..

అన్నే ప్రేరణగా ..

ఖదీర్ పైలట్ కావడానికి అతని అన్న ఒమర్ ఖదీర్ ప్రేరణ. సింగపూర్ కమర్షియల్ పైలట్‌గా పనిచేస్తున్నాడు ఒమర్. దీంతో తాను కూడా పైలట్ కావాలనే ఆకాంక్షతో న్యూజిలాండ్ వచ్చి .. పైలట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కానీ అంతలోనే విధి కబలించింది. ప్రార్థనలు చేస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఒజైర్ చనిపోయాడు.

తెలంగాణకు చెందిన మూడో వ్యక్తి బలి

తెలంగాణకు చెందిన మూడో వ్యక్తి బలి

మసీదుల్లో దుండగుడు సృష్టించిన నరమేధంలో ఖదీర్ మృతితో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఫర్హాజ్ అహ్‌సన్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ కూడా కాల్పుల్లో మృతిచెందారు. కానీ వీరి పేర్లను అధికారులు చనిపోయిన వారి జాబితాలో చేర్చలేదు. అహ్‌సన్ స్వస్థలం కూడా హైదరాబాద్ కాగా .. ఆయన న్యూజిలాండ్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇమ్రాన్‌ఖాన్ స్వస్థలం కరీంనగర్ కాగా .. ఆయన న్యూజిలాండ్‌లో రెస్టారెంట్‌లో పనిచేసేవారు. అహ్‌సాన్ మ‌‌ృతదేహం తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే న్యూజిలాండ్ బయల్దేరి వెళ్లారు. ఖాన్ తల్లిదండ్రులు కూడా న్యూజిలాండ్ వెళ్లారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన అహ్మాద్ ఇక్బాల్ జహంగీర్ గాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+