ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది విద్యార్థులు దుర్మరణం!
అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న మినీ బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కు ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
గోలాఙాట్ జిల్లా రంగాజన్ ప్రాంతంలోని హతీకులి టీ ఎస్టేట్ సమీపంలో జాతీయ రహదారి-715పై ప్రమాదం జరిగింది. బోకాఖాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తున్న ట్రావెలర్, ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టెంపో ట్రావెలర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. పలువురు ప్రయాణీకులు వాహనం లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జనుజ్జయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. తొలుత ఏడుగురు మరణించినట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఆ తర్వాత మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 20 వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గాయపడిన వారిని తొలుత కొహోరా మోడల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం జోర్ఘాట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి పంపించారు. గోలాఘాట్ సీనియర్ ఎస్పీ స్వప్ననీల్ డేకా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మినీ బస్సు అతివేగంగా ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో వాహనాల స్పీడ్ కంట్రోల్ నిబంధనలు ఉన్నప్పటికీ.. అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, అసోం మంత్రి అతుల్ బోరా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మినీ బస్సు అతివేగంగా ప్రయాణించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో వాహనాల వేగ నియంత్రణ నిబంధనలు ఉన్నప్పటికీ, అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, అసోం మంత్రి అతుల్ బోరా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం హిమంత బిస్వా శర్మ దిగ్భ్రాంతి
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కజిరంగాలో జరిగిన విషాదకరమైన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ భారీ ప్రాణనష్టం మమ్మల్ని అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఏ మాటలూ వారి భాధను తగ్గించలేవు, కానీ ఈ కష్ట సమయంలో అసోం మొత్తం వారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. మంత్రి అతుల్ బోరా ఘటనా స్థలంలోన ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు.
We express our deepest condolences over the tragic loss of lives in the horrific road accident at Rongajan, Kaziranga.We stand in solidarity with the bereaved families during this difficult time and pray for eternal peace for the departed souls. We also wish a speedy recovery to all those injured.May the families find the strength and courage to overcome this irreparable loss.
— Assam Congress (@INCAssam) November 13, 2026













Click it and Unblock the Notifications
