"నా భార్య లేచిపోయింది.. నేను సేఫ్".. ఆనందం తట్టుకోలేక 40 లీటర్ల పాలతో స్నానం..
ఇతడి వాలకం చూస్తుంటే ఈయన భార్యా బాధితుడు అని స్పష్టంగా అర్థం అవుతోంది. భార్యను వదిలించుకున్న ఆ వ్యక్తి ఆనందం తట్టుకోలేక 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. తనకు ఇప్పుడే స్వాతంత్ర్యం లభించింది అంటూ తన సంతోషాన్ని చుట్టుపక్కల వారితో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సాధారణంగా ఎవరైనా కపుల్స్ విడాకులు తీసుకుంటే కొన్ని రోజులు బాధపడి.. ఆ తర్వాత మర్చిపోతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన భార్యతో విడాకులను వింతగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తనకు స్వాతంత్ర్యం ఇప్పుడే వచ్చిందంటూ 40 లీటర్లు పాలతో స్నానం చేశాడు. అనంతరం చుట్టుపక్కల వారితో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. బాధల నుంచి తనకు విముక్తి లభించిందంటూ చెప్పుకొచ్చాడు. కొత్త జీవితానికి గుర్తుగా పాలతో స్నానం చేసినట్లు పేర్కొన్నాడు.
అసోంలోని నల్బరి జిల్లా ముకల్మువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ తన భార్యతో విడాకులు తీసుకున్న సంతోషంతో నాలుగు బకెట్ల నీటితో స్నానం చేశాడు. తనకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని పేర్కొన్నాడు. ఈ విడాకుల ద్వారా తనకు విముక్తి కలిగిందని భావించాడు. భార్య నుంచి విముక్తి లభించడం వల్లే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు మాణిక్ అలీ.
He bathed with 40 Litres of Milk
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 12, 2025
His wife eloped several times
He let it go many times for their child
Finally he took a call & chose divorce#Divorce pic.twitter.com/EyHWqcnSku
తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అలా రెండు సార్లు ప్రియుడితో పారిపోయిందని.. రెండుసార్లు పిల్లల కోసం క్షమించి వదిలేశానని.. కానీ తన భార్య పదే పదే తన ప్రియుడితో పారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి భరించలేక భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని వెల్లడించాడు. దీంతో స్థానికులు మాణిక్ ను సమర్థిస్తున్నారు. కట్టుకున్న భార్య అలా చేయడం కరెక్ట్ కాదని.. మాణిక్ తీసుకున్న నిర్ణయం సరైదేనని చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications