వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో ఎన్ఆర్సీ తుది జాబితా.. చేరిన మరికొందరి పేర్లు...

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : జాతీయ పౌరసత్వ రిజిష్టర్ తుది జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పెట్టింది. ఎన్ఆర్సీ తుది జాబితాను గత నెల 31న కేంద్రం విడదుల చేసిన సంగతి తెలిసిందే. అయితే జాబితాలో చోటుదక్కని వారి నుంచి డిమాండ్లు నెలకొనడంతో ... తుదిజాబితాలో అర్హులైన వారి పేర్లను చేర్చి .. ఫైనల్ లిస్ట్ ను కేంద్రం విడుదల చేసింది.

 Assam NRC final status of accepted

మొత్తం మూడున్నర కోట్ల మందితో ఎన్ఆర్సీని కేంద్రం విడుదల చేసింది. ఇందులో 1971 తర్వాత అక్రమంగా దేశంలోకి చొరబడిన వారికి మాత్రం చోటు దక్కలేదు. ఇటీవల కొందరి పేర్లను కూడా చేర్చామని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. తమ ఏఆర్ఎన్ నంబర్‌తోపాటు nrcassam.nic.in ఆన్ లైన్ లో చూసుకోవాలని కోరింది. ఇందులో అసోం ప్రభుత్వం ఆమోదించిన వారి జాబితా కూడా ఉందని తెలిపింది. ఇప్పటివరకు వారిని పెండింగ్ లో ఉంచగా ... తాజాగా వారిని కూడా చేర్చుతున్నట్టు స్పష్టంచేసింది. అసోం ప్రజలు కూడా ఎన్ఆర్సీ లిస్ట్ లో తమ పేర్లు, కుటుంబసభ్యుల పేర్లను పరిశీలించుకోవచ్చని స్పష్టంచేసింది. ఇప్పటివరకు 3 కోట్ల 30 లక్షల 27 వేల 661 మంది ఎన్ఆర్సీ జాబితాలో ఉన్నారు. వీరిలో 19 లక్షల మందికి మాత్రం చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చోటుదక్కని వారు విదేశీ ట్రైబ్యునల్ కూడా ఆశ్రయించే వీలుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా వారికి వెసులుబాటు కల్పించింది.

English summary
The final list of Assam National Register of Citizens (NRC) with individual statuses of all the 3.30 crore applicants has been published online. All the individuals in Assam, who were a part of the Assam NRC exercise meant to root out the illegal immigrants from the state, can now check their status online. All persons who have applied for the inclusion of their names in the NRC list and have a valid ARN number can check their final status online at nrcassam.nic.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X