కుండపోత వర్షంలో తడుస్తూనే డ్యూటీ.. సూపర్ హీరోగా ట్రాఫిక్ పోలీస్..! (వీడియోలు)

అస్సాం : కాసింత వర్షం పడితేనే ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్లరు. అలాంటిది భారీ వర్షంలో డ్యూటీ చేస్తూ ఔరా అనిపించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. అంతేకాదు ఆయన చిత్తశుద్ధికి సోషల్ మీడియా శభాష్ అంటూ కితాబిస్తోంది.

అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఆదివారం (31.03.2019) భారీ వర్షం కురిసింది. అయితే బసిస్త చర్యాలి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మిథున్ దాస్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వర్షాన్ని లెక్క చేయలేదు. సాధారణంగా వర్షం జోరుగా పడ్డప్పుడు విధి నిర్వహణలో ఉండే ట్రాఫిక్ పోలీసులు అలా పక్కకు వెళ్లి తలదాచుకుంటారు. కానీ మిథున్ దాస్ అలా చేయలేదు. కుండపోత వర్షం పడుతున్నా.. తన విధుల్లో మునిగిపోయారు.

Assam traffic cop carry out duty in heavy rain

భారీ వర్షాలు పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడం ఒక కారణమైతే.. త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందర్లో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించరు. కానీ ఇక్కడ మిథున్ దాస్ ట్రాఫిక్ పాయింట్ లో అలాగే నిలబడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. అయితే ఆయన నిలుచున్న ట్రాఫిక్ పాయింట్ దగ్గర ఎలాంటి టాప్ రూఫ్ లేదు. ఆయన అలానే వర్షంలో నిలబడి డ్యూటీ చేశారు. ఆ చిత్తశుద్ధి ఇప్పుడాయనను హీరోగా చేసింది. సోషల్ మీడియాలో మిథున్ దాస్ వీడియోలు వైరల్ కావడంతో అందరూ శభాష్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+