మృతి: రాహుల్‌కి ముద్దు పెట్టిన మహిళ కాదట

భార్యకు నిప్పంటించిన తర్వాత భర్త ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న సంఘటనపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమేనని, భార్యకు భర్త నిప్పంటించి విషయం నిజమేనని, ఆ మహిళ బొంతి కాంగ్రెసు సభ్యురాలేనని, కానీ ఆమె రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న మహిళ కాదని పోలీసులు వివరణ ఇచ్చారు.
గొడవలో సంయమనం కోల్పోయిన భర్త భార్యకు నిప్పంటించాడు. బుధవారంనాడు రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడం ద్వారా ఓ మహిళ ఒక్కసారిగా జాతీయ వార్తల్లోకి ఎక్కింది. తన నుదుటిపై అస్సాంలోని జోర్హాత్‌లో ఆమె ముద్దు పెట్టుకోవడాన్ని రాహుల్ గాంధీ స్వాగతించారు.
అయితే, మహిళలతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు మహిళలను తనకు చాలా సన్నిహితంగా వచ్చి తన చెంపలపై, నుదుటిపై ముద్దుకోవడంతో రాహుల్ గాంధీ కాస్తా ఇబ్బంది కూడా పడ్డారు. మహిళా కార్యకర్తలతో రాహుల్ గాంధీ కరచాలనం చేశారు.
ప్రస్తుతం భార్యను చంపిన భర్త సంఘటనపై తాము విచారణ జరిపామని, ఆ దంపతుల మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. సంఘటనకు రాహుల్ గాంధీతో ముడిపెట్టడం దురదృష్టకరమని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బొంతి భర్త అన్నాడు.












Click it and Unblock the Notifications