Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ హిట్: రాహుల్ గాంధీ ఫ్లాప్, కేజ్రీవాల్ హీరో

న్యూఢిల్లీ: అవునన్నా కాదన్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వాలపై ఉంటుంది. ఫలితాలకు వారిద్దరినీ బాధ్యులుగా పరిగణించడం కూడా కాదనలేని విషయంగా మారింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి తిరుగులేని ఆధిక్యత సాధించగా, ఢిల్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభ కారణంగానే బిజెపి గెలిచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గుజరాత్ నమూనా అభివృద్ధి కూడా ప్రజలను ఆకర్షించిందని అంటున్నారు. రాజస్థాన్‌లో అధికారంలోకి రావడం మాట అటుంచితే చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి బిజెపి అధికారంలోకి రావడానికి మోడీ ఇమేజ్ కారణమని అంటున్నారు. ఫలితాలపై ఏ అంశాలు పనిచేసినప్పటికీ మోడీ ఇమేజ్ ఈ ఫలితాలతో మరింత పెరిగిన మాట మాత్రం వాస్తవం.

It's advantage Narendra Modi as Rahul Gandhi flops

ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా అభివర్ణించారు. వచ్చే ఫైనల్స్‌లో మోడీ బిజెపిని విజయపథాన నడిపిస్తారనే విశ్వాసం మాత్రం పార్టీలో ఇనుమడించింది. పార్టీలో ఆయనపై ఉండే కాస్తో కూస్తో వ్యతిరేకత కూడా తగ్గే అవకాశాలున్నాయి. రాహుల్ గాంధీ ఓటర్లను ఆకర్షించడంలో మరోసారి విఫలమయ్యారని అంటున్నారు. కాంగ్రెసు నాయకులు ఓటమి బాధ్యతను అశోక్ గెహ్లాట్, షీలా దీక్షిత్‌లపై వేస్తున్నారు. ధరల పెరుగుదల ఓటమికి కారణమని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటున్నారు.

కాగా, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ హీరోగా అవతరించారు. దేశమంతా ఇదే ప్రయోగానికి ఆ పార్టీ సిద్ధపడుతుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ఆధిక్యతను దెబ్బ తీయడమే కాకుండా కాంగ్రెసును చిత్తు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్వింద్ కేజ్రీవాల్‌ను అభివర్ణిస్తున్నారు. కొత్త తరహా రాజకీయాలకు నాంది పలికిన నేతగా ఆయన గుర్తింపు ఇనుమడించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శనను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గుర్తించారు. కాంగ్రెసులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే, కాంగ్రెసు పార్టీలో అటువంటి మార్పులు చేయడానికి తగిన వాతావరణం ఉందా అనేది ప్రశ్న.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+