పోలింగ్ లైవ్: సాయంత్రం 4:30 గంటల వరకు పంజాబ్ లో 66 శాతం పోలింగ్

పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ఉన్న గురు హర్ సహాయ్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని యువకులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎనికల్లో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఉదయం 9 గంటలకే 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పంజాబ్ లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అక్కడ ఉదయం 9:30 గంటలకు 8 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

ఉత్తర గోవా ప్రాంతంలో అత్యధికంగా 16 శాతం, దక్షిణ గోవాలో 14 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మీద గోవాలో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Assembly elections Live: Voter turnout stands at 34 percent in Goa till 11 AM

పంజాబ్, గోవా రాష్ట్రాలలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఒటు హక్కును వినియోగించుకున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి కూడా అంతే స్థాయిలో నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ గోవాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అవుతుందని.. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాలలో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. జలంధర్ లోని 66వ నంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది.

Assembly elections Live: 15% overall voting in Goa, technical glitches cause delay in parts of Punjab

పోలింగ్ తీరుతెన్నులు.. విశేషాలు...

07:00 - గోవా రాజధాని పనాజిలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక మొదలైంది.

07:15 - తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పనాజిలోని పోలింగ్ కేంద్రానికి విచ్చేసి క్యూలో నిలబడ్డారు.

07:36 - రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట విలేకరులతో మాట్లాడుతూ ఈసారి గోవాలో పోలింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు.

07:38 - పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు జరిపారు.

07:48 - పంజాబ్ పఠాన్ కోట్ లోని ఎస్డీ కాలేజిలో ఏర్పాటు చేసిన 123, 124 పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు నిరీక్షించారు.

07:48 - పంజాబ్ లో పోలింగ్ ప్రారంభమైంది.

08:10 - పాటియాలా అర్భన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ పై పోటీ చేస్తున్న జనరల్ జెజె సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

08:17 - పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదు అయ్యేందుకు కృషి చేయాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు దానిని వినియోగించుకోవాలని ఆయా రాష్ట్రాలఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

08:20 - పంజాబ్ పఠాన్ కోట్ లోని ఎస్డీ కాలేజిలో ఏర్పాటు చేసిన 123, 124 పోలింగ్ బూత్ లలో ఓటింగ్ మొదలైంది.

08:36 - గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తర గోవాలోని ఆరంబోల్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు.

08:36 - పంజాబ్ లోని లంబి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 118 నంబర్ పోలింగ్ బూత్ లో పోలింగ్ మొదలైంది.

08:48 - పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్ లో సుచాసింగ్ ఛోటేపూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09:00 - జలంధర్, అమృత్ సర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలోని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇక్కడ పోలింగ్ కొద్దిసేపు నిలివేశారు.

09:02 - లంబిలో ప్రకాశ్ సింగ్ బాదల్ కు చారిత్రక ఓటమి ఖాయం: మన్ ప్రీత్ బాదల్ విమర్శ

09:09 - దక్షిణ గోవాలోని మర్ గావ్ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో పలువురు వృధ్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09:15 - సాంకేతిక లోపాల కారణంగా జలంధర్ లోని పోలింగ్ కేంద్రాలలోని ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్ల క్యూ లైన్లు పెరిగిపోయాయి.

09:23 - జనరల్ జెజె సింగ్ (రిటైర్డ్) ఇక్కడి వారు కాదు, ఆయన పారాచూట్ క్యాండిడేట్ : కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మేనకోడలి వ్యాఖ్య

09:25 - ఉత్తర గోవా ప్రాంతంలో అత్యధికంగా 16 శాతం, దక్షిణ గోవాలో 14 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మీద గోవాలో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

09:25 - కాంగ్రెస్ అభ్యర్థి పర్గత్ సింగ్ జలంధర్ లోని నంబర్ 66 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09:30 - పోలింగ్ తీరు అశాజనకంగా ఉంది.. మేం గెలుస్తామనే నమ్మకం కలుగుతోంది : కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ ఆశాభావం.

09:48 - ఆప్, కాంగ్రెస్ లకు షాక్ తప్పదు.. 2012 ఎన్నికల కంటే కూడా ఇప్పటి ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీకి అధిక సీట్లు వస్తాయి : పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆశాభావం.

10:02 - ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ మొహాలీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

10:03 - ఈవీఎంలు మొరాయింపు, మజితాలోని నంబర్ 35 పోలింగ్ బూత్ లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్, ఓటు వేసేందుకు వచ్చి క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న ఓటర్లలో అసహనం.

10:09 - ఉదయం 9:30 గంటల వరకు కూడా పంజాబ్ లో పోలింగ్ శాతం 8 శాతమే.

10:30 - పోయినసారి కంటే పెద్ద విజయం ఈసారి అందుకుంటాం. అమరీందర్ సింగ్ ది కేవలం డ్రామా మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీకి మూడో స్థానమే : సుఖ్ బీర్ సింగ్ బాదల్

10:57 - లంబిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.

11:00 - పోయినసారి కంటే ఈసారి పెద్ద విజయం అందుకుంటాం. అమరీందర్ సింగ్ ది కేవలం డ్రామా మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీకి మూడో స్థానమే : సుఖ్ బీర్ సింగ్ బాదల్

11:15 - తన తల్లి అవతార్ కౌర్ తో కలిసి జలంధర్ లోని నంబర్ 23 పోలింగ్ బూత్ కు వచ్చిన క్రికెటర్ హర్భజన్ సింగ్. క్యూ లైన్ లో నిలబడిన తల్లీకొడుకులు.

11:38 - అరవింద్ కేజ్రీవాల్ ను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ స్పాన్సర్ చేస్తోంది : హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ ఆరోపణ

11:40 - అరవింద్ కేజ్రీవాల్ స్థానికుడు కాడు, ఆయన ఢిల్లీని నాశనం చేశాడు, ఇప్పుడు పంజాబా్ నూ అలాగే చేయాలనుకుంటున్నాడు : హర్ సిమ్రాత్ కౌర్ బాదల్

11:41 - గోవాలో శరవేగంగా సాగుతున్న పోలింగ్. ఉదయం 11 గంటలకే 34 శాతం నమోదు.

11:43 - పంజాబ్ లో ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా మొత్తం పోలింగ్ 14 శాతమే.

11:54 - అమృత్ సర్ లోని ఓ పోలింగ్ బూత్ కు సతీమణి నవజ్యోత్ కౌర్ తో కలిసి వచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.

11:54 - పంజాబ్ ఈసారి కాంగ్రెస్ పార్టీదే. అందరం కలిసి పంజాబ్ ను రాహుల్ గాంధీకి బహుమతిగా ఇద్దాం : నవజ్యోత్ సింగ్ సిద్ధూ.

12:17 - పంజాబ్ లో బీజేపీ-అకాలీదళ్ కూటమే గెలుస్తుంది. ప్రకాశ్ సింగ్ బాదల్ ఆరోసారి పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో డౌటే లేదు : బీజేపీ నేత హన్స్ రాజ్ హన్స్.

12:24 - గోవాలోని మార్ గావ్ ప్రాంతంలో టిబి కున్హా హైస్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ నిలిపివేత.

12:30 - పంజాబ్, గోవాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే సంకేతాలు అందుతున్నాయి : లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానం

12:30 - పంజాబ్, గెలుపు తథ్యమని మా విశ్వాసం. ఎందుకంటే ప్రచారంలో భాగంగా మేం ఇంటింటికి తిరిగినప్పుడు మా అమ్మా నాన్నల విషయంలో ప్రజా స్పందన బాగా కనిపించింది : కరణ్ సింగ్ (నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనయుడు)

12:55 - పంజాబ్ లో మధ్యాహ్నం వరకు 32 శాతం పోలింగ్ నమోదైంది.

1:24 - ఉత్తర గోవాలో 55 శాతం, దక్షిణ గోవాలో 52 శాతం పోలింగ్ నమోదు

1:30 - మధ్యాహ్నం ఒంటి గంట వరకు గోవాలో మొత్తం పోలింగ్ 53 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

1:50 - మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంజాబ్ లో 37 శాతం పోలింగ్ నమోదైంది.

2:00 - పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా లోని నంబర్ 89 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3:00 - పంజాబ్ లో మధ్యాహ్నం 2:30 గంటల వరకు పోలింగ్ 48 శాతం నమోదైంది.

3:20 - గోవాలో పోలింగ్ శాతం మరింత పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రాష్ట్రంలో 67 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

3:50 - పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ఉన్న గురు హర్ సహాయ్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని యువకులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

3:55 - గోవాలో 36 శాతం పురుష ఓటర్లు, 31 శాతం మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4:10 - పంజాబ్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం పోలింగ్ 56.9 శాతంగా నమోదైంది.

4:50 - పంజాబ్ లో సాయంత్రం 4:30 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+