ఆపాయింటెడ్ డే: అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని మరోసారి ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురు, శుక్రవారాల్లో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం దినం అపాయింటేడ్ డే మే 31 లోపు ఉంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. జూన్ తర్వాత అపాయింటెడ్ డే ఉంటే సార్వత్రిక ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. చివరి రెండు దశల ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల సోమవారం నాలుగు గంటలకు విడుదల కావాల్సి ఉంది. సోమవారం జరిగిన ఎన్నికల కమిషన్ అధికారుల సమావేశంలో కొంత మంది భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఈనెల 6, 7 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆరు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల వాయిదా ఉండదని ఇంతకు ముందు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే, దానికి అపాయింటెడ్ డేతో సంబంధం ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications