ఆ ఎమ్మెల్యేల ఆస్తులు ఐదేళ్లలో 82 శాతం పెరిగాయి
యూపీలో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత అయిదేళ్లలో 82 శాతం పెరిగాయి. వీరి ఆస్తులు సరాసరిగా రూ.2.84 కోట్లు మేర పెరిగాయి.
లక్నో: యూపీలో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత అయిదేళ్లలో 82 శాతం పెరిగాయి. వీరి ఆస్తులు సరాసరిగా రూ.2.84 కోట్లు మేర పెరిగాయి.
2012లో గెలుపొందిన 311 మంది ఎమ్మెల్యేలు ఈసారి బరిలోకి దిగారు. వీరి ఆస్తులు 2012లో సరాసరిగా రూ.3.49 కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు వారి ఆస్తులు రూ.6.33 కోట్లకు పెరిగాయి.
యూపీ ఎన్నికల నిఘా సంస్థతో కలిసి ఆయా అభ్యర్థుల ఆస్తుల వివరాలను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలలో బీఎశ్పీ నేత షా ఆలం ఉర్ఫఅ జమాలి అత్యధికంగా ఆస్తులు కూడబెట్టారు.

2012 నుంచి 2017 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ.64 కోట్లు పెరిగాయి. ఆయన తర్వాత మరో బీఎస్పీ ఎమ్మెల్యే నవాబ్ కరీం అలీ ఖాన్ ఆస్తులు ఏకంగా రూ.40 కోట్లు పెరిగాయి. తదుపరి స్థానంలో బీఎస్పీ ఎమ్మెల్యే అనూప్ కుమార్ ఉన్నారు.
ఆయన ఆశ్తులు రూ.35 కోట్లు పెరిగాయి. పార్టీల ప్రకారం చూసుకుంటే ఎస్పీకి చెందిన 162 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.2 కోట్లు మేర పెరగగా, బీఎస్పీకి చెందిన 57 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4 కోట్ల మేర పెరిగాయి. బీజేపీకి చెందిన 55 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.2 కోట్ల మేర పెరగగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.2 కోట్ల మేర పెరిగాయి.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications