బెంగళూరు స్వామీజీ, నటి రాసలీలలు, వెంటాడి నటి సోదరుడు, తల్లి మీద కత్తులతో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హణసమారనహళ్ళి మఠం దయానంద స్వామిజీతో రాసలీలలు జరిపిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కత్తిపోట్లుకు గురైన నటి సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 రాసలీలల వీడియో వైరల్ !

రాసలీలల వీడియో వైరల్ !

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్ళి సమీపంలో కన్నడ నటి సోదరుడు కృష్ణ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరు శివార్లలోని హణసమారనహళ్ళి మఠం దయానంద స్వామిజీ, ప్రముఖ కన్నడ నటి రాసలీలల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

 స్వామీజీ ఔట్, నటి !

స్వామీజీ ఔట్, నటి !

రాసలీలల వీడియో బయటకు వచ్చిన సందర్బంలో మఠం దగ్గర భక్తులు వారం రోజుల పాటు ఆందోళన చెయ్యడంతో దయానంద స్వామిజీని మఠం నుంచి బహిష్కరించారు. తరువాత 10 మంది తనను నమ్మించి మోసం చేసి నా జీవితం నాశనం చేశారని నటి ఆత్మహత్యాయత్నం చేసింది.

 చంపేస్తామన్నారు

చంపేస్తామన్నారు

తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ నటి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. స్వామీజీ రాసలీలల సీడీలో ఉన్న నటి సోదరుడు కృష్ణ, ఆయన తల్లి కారులో మంగళూరు నుంచి శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళికి బయలుదేరారు.

 వెంటాడి కత్తులతో !

వెంటాడి కత్తులతో !

మంగళూరు నుంచి నటి సోదరుడు కృష్ణ వెలుతున్న కారును మరో కారులో కొందరు వెంబడించారు. తీర్థహళ్ళి సమీపంలో కృష్ణ వెలుతున్న కారును అడ్డగించి వెంటాడి అతని మీద, ఆయన తల్లి మీద కత్తులతో దాడి చేశారు. నటి సోదరుడు కృష్ణ కత్తిపోట్లకు గురైనాడు.

 తప్పించుకున్న తల్లీ, కొడుకు

తప్పించుకున్న తల్లీ, కొడుకు

దుండగుల దాడి నుంచి తప్పించుకున్న కృష్ణ అతని తల్లి తీర్థహళ్ళి చేరుకుని జేసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నటి అనేక సార్లు ఆరోపించారు. శుక్రవారం నటి కుటుంబ సభ్యులపై హత్యాయత్నం జరగడంతో పోలీసులు హడలిపోయారు. కృష్ణ, ఆయన తల్లి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Assulted brother and mother who was actress involved Bengaluru swamiji sex scandal case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X