హత్రాస్ మృతురాలి తండ్రి భిన్న స్వరం: నిరసనలు, ఆందోళనలు ఎందుకు, అవసరం లేదు..
హత్రాస్ దళిత మహిళపై లైంగికదాడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కదం తొక్కారు. వారిని పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే మృతురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై జరుగుతోన్న విచారణపై తనకు నమ్మకం ఉంది అని చేసిన వ్యాఖ్యలతో.. విపక్ష కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడింది.

మృతురాలి తండ్రి వాదన ఇలా..
తీవ్రగాయాలతో యువతి చనిపోగా.. అర్ధరాత్రి 2.45 గంటలకు పోలీసులు బలవంతంగా దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై వివాదం నడుస్తోండగా.. రాహుల్, ప్రియాంక పరామర్శించేందుకు బయల్దేరారు. అయితే మృతురాలి తండ్రి మాత్రం.. విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు. తాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన సందేహాలను లేవనెత్తానని తెలిపారు. తమ కూతురికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇదే విషయాన్ని వీడియో కాల్‌లో యోగి చెప్పారని తెలిపారు.

పూర్తి విశ్వాసం ఉంది..
సీఎం యోగి ఇచ్చిన హామీతో తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఘటనపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రహదారిపై కూర్చొని ఆందోళనలు/ ధర్నా చేయడం వృథా ప్రయాస అవుతుందని తెలిపారు.

సిట్, ఫాస్ట్రాక్ కోర్టు
హత్రాస్ ఘటనపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యోగి సర్కార్ స్పందించింది. యువతిపై లైంగికదాడి ఘటనపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు వారంలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ తర్వాత విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దీంతో వేగంగా విచారణ జరిగి.. నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తుంటే.. మృతురాలి తండ్రి చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications