ప్రధాని మోదీకి పదవి గండం-అమిత్ షాకు అనారోగ్యం: వేణుస్వామి సంచలన జోస్యం!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంటారు. ప్రస్తుతం ఆయన వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మరోసారి వేణు స్వామి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది గ్రహాల గమనం చాలా డిఫరెంట్ గా నడుస్తోందని.. కుజుడు గానీ, కేతువు గానీ, రాహువు గానీ, గురుడు గానీ, శని వంటి గ్రహాల గమనం డిఫరెంట్ గా కనిపిస్తోందని ఆయన చెప్పారు. గురువు అతిచారంలోకి వెళ్తున్నట్లు.. కర్కాటకం నుంచి సింహంలోకి.. తిరిగి సింహం నుంచి కర్కాటకంలోకి రాబోతున్నట్లు వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో దేశంలో కొన్ని పెను సంచలనాలు జరిగే అవకాశం ఉందని వేణుస్వామి జోస్యం చెప్పారు.
మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? జాగ్రత్త.. వేణుస్వామి తీవ్ర హెచ్చరిక!
ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఆయన జోస్యాన్ని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజలు నగదు రూపంలో(లిక్విడ్ క్యాష్) ధనాన్ని నిలవ ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రపంచంలో అతికష్టమైన పని ఏంటంటే.. మన దగ్గర ఉన్న డబ్బును మన దగ్గరే ఉంచుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అని ఆయన పేర్కొన్నారు. చాలా మంది డబ్బును వ్యాపారంలో పెట్టి నష్టపోయి చేతులు కాల్చుకుంటారని.. లేదా అప్పులు ఇచ్చి మోసపోతూ ఉంటారని వేణుస్వామి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో అప్పులు ఇస్తే ఒక్క రూపాయి కూడా తిరిగిరాదని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుతం వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు లేవన్నారు. కాబట్టి ప్రజలు వారి వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకుని వచ్చే ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదా ఇంట్లోనే దాచుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, అప్పులు ఇవ్వడం వంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా పాటించాలన్నారు.

ప్రధాని మోదీకి పదవి సమస్యలు?
అలాగే భారతదేశానికి సంబంధించి పెనుసంచలనాలు ఉండబోతున్నాయని వేణు స్వామి జోస్యం చెప్పారు. దేశ ప్రధానికి సంబంధించి పదవి సమస్యలు ఉండబోతున్నాయని ఆయన పెద్ద బాంబ్ పేల్చారు. అలాగే అమిత్ షాకు పదవి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఉంటాయని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాజకీయాల్లో పెనుసంచలనాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 2029 వరకు ఈ విషయాలు జరుగుతాయని చెప్పారు.
భారత్-పాక్ మధ్య యుద్ధం?
ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి వెల్లడించారు. ఒకవేళ యుద్ధం వస్తే నిత్యావసరాల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి నిత్యావసరాలను సమకూర్చుకోవాలని ప్రజలకు సూచించారు. మరోవైపు ఎవ్వరైనా రాజకీయాల గురించి సన్నిహితుల వద్ద వాదించడం మానుకోవాలని హితవు పలికారు. అసలు రాజకీయాలు గురించి మాట్లాడవద్దనన్నారు. రాబోయే కాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని.. ఈ క్రమంలో వాటి గురించి వాదించడం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉందని.. కాబట్టి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల వద్ద వాటి గురించి మాట్లాడవద్దని సూచించారు.
అలాగే రాజకీయాలకు సంబంధించిన బెట్టింగ్ విషయాలకు చాలా దూరంగా ఉండాలని వేణు స్వామి తెలిపారు. 2027లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయని.. ఆ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ లు వేయొద్దని ఆయన పేర్కొన్నారు. 2029 వరకు జరగబోయే ఎన్నికల్లో పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంటే అంచనాకు అందని రిజల్ట్స్ వస్తాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
