వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగోలో మారణహోమం: ఉగ్ర దాడుల్లో 39 మంది బలి -కరోనాకు 32 మంది ఎంపీలు మృతి

|
Google Oneindia TeluguNews

అటు కరోనా, ఇటు ఉగ్రవాదుల మారణహోం ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను అల్లాడిస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబులు, తుపాకుల‌తో విరుచుకుప‌డ‌టంతో దాదాపు 39 మంది మరణించినట్లు స‌మాచారం.

మోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలుమోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలు

కాంగో తూర్పు చివరన ఉన్న బోగా, తచాబీ గ్రామాల్లో రెడు వేర్వేరుచోట్ల జరిగిన ఈ ఉగ్ర‌దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థగా కాంగో ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అనూహ్యరీతిలో శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలపై ఈ దాడి జరిగిందని ఒక వార్తా సంస్థ ధ్రువీకరించింది.

At least 39 dead in two attacks in eastern DR Congo, 32 mps died of covid

ఉగ్ర దాడుల్లో మరణించిన మొత్తం 39 మందిలో ఇప్పటివరకు 36 మంది మృతదేహాలను వెలికి తీసిన‌ట్లు స‌మాచారం. ఉత్తర కివు ప్రావిన్స్-ఇటురి మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న‌దని, రెండు ప్రాంతాలలో ఎప్పుడూ ఉద్రిక్తత‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు.

జగన్‌కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్‌హెచ్‌ఆర్‌సీసీ పంత్‌తో భేటీ -నిర్వచనం మారితే?జగన్‌కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్‌హెచ్‌ఆర్‌సీసీ పంత్‌తో భేటీ -నిర్వచనం మారితే?

కాంగో తూర్పు చివరను ఆక్రమించిన 122 మంది ఉగ్రవాదుల ఏడీఎఫ్‌ చాలా ఘోరమైన సమూహంగా అంచనా వేయబడింది. వాస్తవానికి, ఈ ప్రాంతం ఖనిజాలతో నిండి ఉన్న‌ది. ఈ కారణంగా ఈ స్థలం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. 1996-2003 మధ్య రెండు ప్రాంతీయ యుద్ధాలు కూడా జరిగాయి. ఉత్త‌ర‌ కివులోని బెని ప్రాంతంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 1228 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఎన్జీఓ కేఎస్టీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే

కాంగోలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశ పార్లమెంటు సభ్యుల్లో 32 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు కరోనా, మరోవైపు ఉగ్రవాదం చేతిలో నలుగుతూ కాంగో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.

English summary
At least 39 people were killed in two new attacks in the eastern Democratic Republic of Congo, where hundreds have died in massacres since the start of the year, monitors said on Monday. meanwhile, 32 members of DR Congo's parliament have died of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X