అటల్ బిహారీ వాజపేయి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరో రెండ్రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు వైద్య చికిత్స అందించనున్నట్లు చెప్పారు. ఆయన మూత్రనాళ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Atal Bihari Vajpayee health: Former PM stable, AIIMS says he is on injectable antibiotics

వాజపేయి తాము అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. ఆయన ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకు ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పారు. కాగా, అనారోగ్యం కారణంగా వాజపేయి గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు.

ఇది ఇలా ఉండగా, వాజపేయి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు. సోమవారం ఆస్పత్రిలో చేర్చడంతో వాజపేయిని ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, పలువరు కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+