పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..?: వాజపేయి సమాధానం ఇది!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజపేయి ఆజన్మ బ్రహ్మచారిగా జీవనం సాగించిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆయన జీవితమంతా తపించారు. అయితే, తన వివాహం గురించి ప్రశ్నించిన సందర్భంలో ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
'నాకు వివాహం చేసుకునేంత సమయం లభించలేదు. బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నా' అని చెప్పుకొచ్చారు వాజ్‌పేయి. మరో సందర్భంలో 'నాకు తగిన అమ్మాయి దొరకలేదు' అని నవ్వుతూ సమాధానం ఇచ్చారట.

కాగా, తన జీవితంలో అత్యంత బాధ కలిగించిన సందర్భం ఏందంటే.. అయిదో తరగతిలో తన ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టడమేనని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి వివాహం చేసుకోకపోవడానికి రాజకీయ పండితులు మరో కారణం కూడా చెబుతారు.
Recommended Video

ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన ఆయన.. పనినే దైవంగా భావించేవారట. వివాహం చేసుకుంటే ప్రచారక్‌గా తన విధులను సరిగా నిర్వర్తించలేనేమోనని భావించే వాజ్‌పేయీ పెళ్లి చేసుకోలేదని చెబుతారు.












Click it and Unblock the Notifications