డ్రైవర్‌ను బంధించి అశ్లీల ఫొటోలు తీసిన నటి అరెస్టు
చెన్నై: కారు డ్రైవర్‌ను బంధించి అశ్లీల ఫొటోలు తీసి, అతని నుంచి డబ్బులు లాక్కున్న ఓ సినీ సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన రామ్ జయం (45) పోరూర్ మాంబాక్కంలో నివసిస్తూ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతను బుధవారం చెన్నై తూర్పు సముద్ర తీర ప్రాంతంలోని కానాత్తూర్ పోలీసు స్టేషన్‌లో తనను ఓ సహాయ నటి దోచుకున్న విషయంపై ఫిర్యాదు చేశాడు. ఉత్తాండి ప్రాంతంలో నివసిస్తున్న సహాయ నటి, మరో వ్యక్తితో కలిసి తనను ఇంట్లో బంధించి అశ్లీలంగా ఫొటోలు తీసి డబ్బు కాజేసిందని అతను ఫిర్యాదు చేశాడు.

తన ఫోటోలను ఆమె దుర్వినియోగం చేస్తుండవచ్చునని అందోళన చెందుతున్నట్లు అతను తెలిపాడు. సహాయ నటిపై, అమె అనుచరుడిపై తగిన చర్యలు తీసుకోవాలని రామ్ జయం కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
కొన్ని రోజు క్రిందట తనకు రామ్ జయంతో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి మంచి అమ్మాయి ఉంటే చెప్పాలని తనకు రోజూ ఫోన్ చేసి వేధించేవాడని, దాన్ని తట్టుకోలేక ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నానని ఆమె తెలిపింది.
రామ్ జయానికి ఫోన్ చేసి మంచి అమ్మాయి ఉందని రావాలని చెప్పి అతను వచ్చిన తర్వాత బంధించి అశ్లీల ఫొటోలు తీసి అతని వద్ద ఉన్న రెండు వేల రూపాయలు తీసుకున్నట్లు ఆమె తెలిపింది.












Click it and Unblock the Notifications