ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్?: కాబోయే భర్తకు ఆ ఫోటోలు.. చెన్నై క్రీడాకారుడి నిర్వాకం!

జ్యోతియమ్మాల్ నగర్ కు చెందిన అతనితో క్రమంగా స్నేహం బలపడి ప్రేమగా మారింది.ఇటీవల ఇద్దరు విడిపోయిన నేపథ్యంలో..

టీనగర్: ఓ క్రీడా శిక్షణ శిబిరంలో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెంచింది. రాను రాను మరింత దగ్గరితనం ఏర్పడటంతో.. ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. అయితే ఇద్దరి మధ్య ఏం విభేదాలు తలెత్తాయో తెలియదు గానీ.. ఇటీవల అబ్బాయిని అమ్మాయి దూరం పెడుతూ వచ్చింది.

ప్రియురాలి తీరు పట్ల తీవ్ర అసహనంతో ఉన్న ప్రియుడు.. ఆమె తనతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజాలు వెలుగుచూశాయి. చెన్నై నగరంలోని కీల్పాక్కంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పరిచయం అక్కడే:

పరిచయం అక్కడే:

చెన్నై ట్రిప్లికేన్ కి చెందిన ఓ యువతి(22) కీల్పాక్కంలోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. క్రీడాకారుడైన ఆమె తండ్రి.. హర్డిల్స్ అనే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. ఇక్కడికి తరుచుగా వచ్చే ఆ యువతికి.. ఇక్కడే శిక్షణ పొందుతున్న దీపక్ అలియాస్ డేనియల్(22)తో పరిచయం ఏర్పడింది. జ్యోతియమ్మాల్ నగర్ కు చెందిన అతనితో క్రమంగా స్నేహం బలపడింది.

బ్రేకప్ తర్వాత:

బ్రేకప్ తర్వాత:

ఇదే క్రమంలో కొన్నిరోజుల పాటు ప్రేమించుకున్న వీరిద్దరు.. ఇటీవలే విడిపోయారు. వీరి విషయం యువతి ఇంట్లో తెలియడంతో.. ఆమెకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. యువతి సైతం తమ తల్లిదండ్రులు చూసిన వివాహమే చేసుకుంటానని, నువ్వు నా వెంట పడాల్సిన అవసరం లేదని దీపక్ తో చెప్పింది. ఇద్దరి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు.. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. యువతి దీపక్ ను దూరం పెట్టేసింది.

Recommended Video

    Rape On Two Minor Girls In suryapeta BC Hostel Lavanya Usha Rani
    వాట్సాప్‌లో అసభ్య ఫోటో:

    వాట్సాప్‌లో అసభ్య ఫోటో:

    యువతి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన దీపక్.. యువతి తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను వాట్సాప్ ద్వారా ఆమెకు కాబోయే భర్తకు పంపించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు దీపక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. మరిన్ని విషయాలు వెలుగుచూశాయి.

    ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్:

    ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్:

    తమ మధ్య బేధాభిప్రాయాలు రావడం కన్నా ఒకరోజు ముందు.. యువతిని తన స్నేహితుల గదికి తీసుకెళ్లినట్లు దీపక్ చెప్పాడు. అక్కడ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారం జరిపానని చెప్పాడు. విషయం తెలిసిన యువతి ఆమె తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించిందని, దీంతో అసభ్య చిత్రాలతో ఆమెను బెదిరించానని చెప్పుకొచ్చాడు. దీపక్ కు వేరే అమ్మాయిలతోను సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+