Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం: పిన్న వయస్కురాలిగా రికార్డ్

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆతిశీ (Atishi) ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆప్‌ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా ఆతిశీ నిలిచారు.

Atishi takes oath as the new Chief Minister of Delhi

అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేపట్టనున్న మహిళగా కూడా ఆతిశీ నిలిచారు. ఆతిశీతోపాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోట్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు.

కాగా, ఢిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసి ఆప్ గద్దెనెక్కింది. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు 1998లో సుష్మా స్వరాజ్‌ కేవలం 52 రోజుల పాటు సేవలందించారు.

షీలాదీక్షిత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్‌ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిశీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ వయసులోనే ఈ పగ్గాలు అందుకున్నారు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్‌ మినహా ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎంలు లేరు. దీంతో మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎంగా ఆతిశీ వ్యవహరిస్తున్నారు.

కాగా, ఆతిశీ 1981 జూన్‌ 8న జన్మించారు. ఆమె పేరు మధ్యలో మార్లేనా అనే పేరు చేర్చడం వెనుక ఓ ఆసక్తికర అంశం ఉంది. ఆమె తల్లిదండ్రులు విజయ్‌ సింగ్, త్రిప్త వాహి ప్రొఫెసర్లు. వారు కార్ల్‌ మార్క్స్, లెనిన్‌ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి మార్లేనా అనే పేరును చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచీ ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆతిశీ మార్లేనా సింగ్ ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందినవారు. 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. అంచెలంచెలుగా ఎదిగారు. మనిష్ సిసోడియావిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించి, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మార్చడంలో సఫలీకృతురాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఢిల్లీ నీటి సంక్షోభం, స్వాతి మాలీవాల్ దాడి కేసుల్లోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఢిల్లీ కేబినెట్ లో ఏకైక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా, ముఖ్యమంత్రి పదవి చేపట్టి దశాబ్ద కాలంలోనే తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+