బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ATM: రూ. 64 లక్షలతో ఎస్కేప్, పెళ్లైన పాల బుగ్గల అత్త కూతురితో జల్సా, రూ. 30 లక్షలు నాకేశాడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: ;పెళ్లైన పాల బుగ్గల అత్తకూతురు మోజులో కట్టుకున్న భార్య, పిల్లలను వదిలేసి ఏటీఎం యంత్రాల్లో పెట్టాల్సిన రూ. 64 లక్షల నగదుతో పరారైన కిలాడీ పోలీసులకు చిక్కిపోయాడు. అత్త కూతురితో మస్త్ మజా చేస్తున్న సమయంలో కాలాంతకుడు పోలీసులకు చిక్కాడు. అత్త కూతురితో జల్సా చెయ్యడానికి 7 రోజుల్లో రూ. 30 లక్షలు స్వాహా చేసేశాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి లాయర్ కు ఏకంగా 26 లక్షలకు డీల్ మాట్లాడుకున్నాడు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. కట్టుకున్న భర్త వదిలేయడం, ప్రియుడు జైలుకు వెళ్లడంతో అత్త కూతురి పరిస్థితి మలయాళం సినిమా కథలాగా తయారైయ్యింది.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

 భలే మాయలోడు

భలే మాయలోడు

కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి నివాసి యోగీష్ అనే వ్యక్తి సెక్యూర్ వ్యాల్యూ సంస్థలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చెయ్యడానికి ఉపయోగిస్తున్న వాహనం ( ఏటీఎం క్యాష్ వ్యాన్) డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం నుంచి యోగీష్ చాలా నమ్మకంగా సెక్యూర్ వ్యాల్యూ సంస్థలో వ్యాన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరి 3వ తేదీన యోగీష్ తో పాటు సెక్యూర్ వ్యాల్యూ ఉద్యోగులు బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో ఏటీఎంలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లారు.

 రూ. 64 లక్షలు లూటీ

రూ. 64 లక్షలు లూటీ

సాటి సిబ్బంది కళ్లుకప్పిన కేటుగాడు యోగీష్ ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 64 లక్షల నగదుతో పరారైనాడు. ఏటీఎం యంత్రాల్లో నిల్వ చెయ్యాల్సిన రూ. 63 లక్షల నగదుతో పాటు పరారైన యోగీష్ కోసం బెంగళూరు పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలించారు. చివరికి ఏటీఎం క్యాష్ వ్యాన్ జీపీఎస్ ఆధారంగా ఆ వాహనాన్ని ఓ ప్రాంతంలో గుర్తించి దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 క్రిమినల్ మైండ్

క్రిమినల్ మైండ్

రూ. 64 లక్షల నగదుతో మాయం అయిన యోగీష్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రూ. 64 లక్షలతో మాయం అయిన తరువాత యోగీష్ అతని మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేటుగాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం పోలీసులు గుర్తించలేకపోయారు. పోలీసు ఇన్స్ పెక్టర్ లతా ఆధ్వర్యంలో యోగీష్ కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలించారు. అయినా యోగీష్ గురించి చిన్న క్లూ కూడా పోలీసులకు చిక్కలేదు.

 ఏం ప్లాన్ వేశాడు.... భార్యకు ఏం చెప్పాడు ?

ఏం ప్లాన్ వేశాడు.... భార్యకు ఏం చెప్పాడు ?

బెంగళూరులోని నందిని లేఔట్ లో యోగీష్ కు భార్య రూపవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ. 64 లక్షలు లూటీ చేసి యోగీష్ నేరుగా నందిని లేఔట్ లోని ఇంటికి వెళ్లాడు. తాను ఆఫీసు పనిమీద కుక్కేసుబ్రమణ్య (పుణ్యక్షేత్రం)కు వెలుతున్నానని, బెంగళూరుకు తిరిగి రావడానికి నాలుగు రోజులు అవుతుందని భార్య రూపవతిని నమ్మించాడు. లూటీ చేసి డబ్బుల్లో భార్య రూపవతి ఇంటి ఖర్చుల కోసం కేవలం రూ. 50 వేలు ఇచ్చిన యోగీష్ అక్కడి నుంచి చెక్కేశాడు.

 పాల బుగ్గల అత్త కూతురు, పక్కన పెళ్లాం

పాల బుగ్గల అత్త కూతురు, పక్కన పెళ్లాం

యోగీష్ కు అత్త కూతురు సీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే పాల బుగ్గల బ్యూటీ ఉంది. సీతల్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యి ఓ కొడుకు ఉన్నాడు. ముంబాయిలో ఉంటున్న భర్తతో అన్యోన్యంగా లేని సీతల్ భర్తకు దూరంగా ఉంటోంది. ఓ పక్క అత్తకూతురు సీతల్ తో ఎంజాయ్ చెయ్యడానికి, భార్య రూపవతి, ఇద్దరు పిల్లలను పోషించడం కష్టం కావడంతో యోగీష్ ఏటీఎం క్యాష్ లూటీ చెయ్యాలని పక్కాప్లాన్ వేసుకున్నాడు.

 ఏడురోజులు ఎంజాయ్

ఏడురోజులు ఎంజాయ్

అత్తకూతురు సీతల్ తో పరారైన యోగీష్ మైసూరు జిల్లాలోని హెచ్ డీ కోటేలో ఓ ఇంటిని తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేశాడు. కేసు విషయం ఏం అయ్యింది అని తెలుసుకోవడానికి యోగీష్ ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని, నువ్వు వెంటనే లాయర్ ను సంప్రధించాలని ఫ్రెండ్ సూచించాడు. క్రిమినల్ లాయర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడిన యోగీష్ కేసు నుంచి నన్ను తప్పిస్తే నీకు రూ. 46 లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడుకున్నాడు. క్రీమినల్ లాయర్ శ్రీధర్ కు లూటీ చేసిన డబ్బులో భారీ మొత్తం ఇచ్చాడు.

 టైమ్ బ్యాడ్,,,, రూ. 30 లక్షలు నాకేశాడు

టైమ్ బ్యాడ్,,,, రూ. 30 లక్షలు నాకేశాడు

పోలీసులు యోగీష్ మొబైల్ టవర్ ఆధారంగా హెచ్ డీ కోటే చేరుకున్నారు. అత్త కూతురు సీతల్ తో మస్త్ మజా చేస్తున్న యోగీష్ ను పోలీసులు పట్టుకున్నారు. యోగీష్ దగ్గర కేవలం రూ. 34 లక్షలు మాత్రమే రికరీ అయ్యిందని, మిగిలిన రూ. 30 లక్షలు కేవలం ఏడు రోజుల్లో నాకేశాడని పోలీసులు అన్నారు.

 అత్త కూతురు బతుకు బస్టాండ్

అత్త కూతురు బతుకు బస్టాండ్

యోగీష్ కు బెండ్ తీసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించడానికి సిద్దం అయ్యారు. ఎంతో మందికి బెయిల్ ఇప్పించిన క్రిమినల్ లాయర్ శ్రీధర్ ఇప్పుడు పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడు. కట్టుకున్న భర్త వదిలేయడం, మామ కొడుకు యోగీష్ జైలుకు వెళ్లడంతో పాల బుగ్గల అత్త కూతురు సీతల్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది.

English summary
ATM: Bengaluru ATM Van Driver who escape with Rs 64 lakh with his sister in law Arrested near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X