దొంగల బీభత్సం: ఏకంగా ఏటిఎంనే ఎత్తుకెళ్లారు
పఠాన్‌కోట్: దోపీడీ చేసేందుకు వచ్చిన దొంగలు ఏకంగా ఏటిఎంనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పఠాన్‌కోట్‌లోని సర్ణ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగులు ఏకంగా ఆ ఏటీఎంనే ఎత్తుకెళ్లారు.
చోరీ జరిగిన సమయంలో ఏటీఎంలో రూ.3,70,700 నగదు ఉన్నట్లు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఏటీఎం వద్ద సెక్యురిటీ గార్డు లేకపోవడం వల్లే చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు.

ఏటీఎంను చోరీ చేయడానికి ముందు దొంగలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీని ధ్వంసం చేశారని, వాటిపై బ్లాక్ స్ప్రే చల్లారని పోలీసులు తెలిపారు.
బ్యాంకు మేనేజర్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసును పఠాన్‌కోట్ సీనియర్ ఎస్పీ రాకేష్ కౌశల్ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications