ఒరిస్సాలో దారుణం.. నర్సు నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి విషాదకర ఘటన జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ఒకే రాత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ మరణాలకు ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్నే కారణంగా మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చనిపోయిన రోగులు ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో నర్సు రోగులకు రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చారని.. ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే రోగులు తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయి మరణించారని వాపోతున్నారు. వారంతా శస్త్రచికిత్సల అనంతరం కోలుకుంటూ ఉన్నారని.. ఇంజెక్షన్ చేసిన తర్వాతే అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించిందని బంధువులు వాపోయారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వారు ఆసుపత్రి సిబ్బందిపై నిర్లక్ష్యం కారణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే బాధితుల సమాచారం మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉద్రిక్తతలు జరగకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక రాగానే అసలైన కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఆసుపత్రి యాజమాన్యం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతే కాకుండా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications