మళయాలం నటిపై లైంగిక దాడి: 49 నిమిషాలు వీడియో, మెమరీ కార్డు, సునీ చేతిలో జాతకాలు !
ప్రముఖ మళయాలం నటిపై కారులో జరిగిన సామూహిక లైంగిక దాడి కేసు విచారణ ప్రతి రోజు ఓ కొత్త మలుపు తిరుగుతోంది. కారులో నటిపై లైంగిక దాడి జరిగే సమయంలో ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ .
కొచ్చి: ప్రముఖ మళయాలం నటిపై కారులో జరిగిన సామూహిక లైంగిక దాడి కేసు విచారణ ప్రతి రోజు ఓ కొత్త మలుపు తిరుగుతోంది. కారులో నటిపై లైంగిక దాడి జరిగే సమయంలో ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ తన మొబైల్ వీడియో తీశాడని వెలుగు చూసింది.
పోలీసుల విచారణలో ఆ విషయం బయటపడింది. అయితే తన మొబైల్ ఎక్కడో పడిపోయిందని పల్సర్ సునీ పోలీసులకు మస్కా కొట్టాడు. అయితే పోలీసులు బెండ్ తియ్యడంతో మొబైల్ లోని మెమరీ కార్డు తీసుకున్న తరువాత మొబైల్ విసిరివేశానని పల్సర్ సునీ అంగీకరించాడని సమాచారం.

ప్రముఖుల హస్తం ?
ప్రముఖ నటి లైంగిక దాడి కేసు విచారణ చేస్తున్న పోలీసులు అదే కేసులో అరెస్టు అయిన పల్సర్ సునీని విచారించి వివరాలు సేకరించారు. ఎలాగైనా ఈ కేసులో ప్రముఖ నిందితులను అరెస్టు చెయ్యాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం !
పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు నివేదిక తయారు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. మళయాలం నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రముఖుల ప్రమేయం ఉందని గట్టిగా ఆరోపణలు రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు.

సీబీఐకి ఇవ్వండి: మంజు వారియర్
నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో అసలు దోషులు తప్పించుకోకుండా చూడాలని ప్రముఖ మళయాలం హీరో దిలీప్ మొదటి భార్య, నటి మంజు వారియర్ పోలీసు అధికారులకు మనవి చేశారు. ఒత్తిడితో పోలీసులు అసలు నిందితులను తప్పించడానికి ప్రయత్నిస్తే కేసు సీబీఐకి అప్పగించే వరకు పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

హీరో దిలీప్, దర్శకుడు
ప్రముఖ మళయాలం హీరో దిలీప్, ప్రముఖ దర్శకుడు, నిర్మాత నదిర్ షాను ఇప్పటికే పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. అయితే నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో మరోసారి వీరిద్దరిని విచారించడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.

నటి కావ్య ఇంటిలో ?
మళయాలం హీరో దిలీప్ రెండవ భార్య, నటి కావ్య మాధవన్ కు చెందిన ఈ-కామర్స్ షోరూంలో, ఆమె ఇంటిలో ఇప్పటికే పోలీసులు సోదాలు చేశారు. నటిపై లైంగిక దాడి జరిగిన సమయంలో వీడియో తీసిన పల్సర్ సునీ ఆ మొబైల్ మెమరీ కార్డు నటి కావ్య మాధవన్ ఈ కామర్స్ షో రూంకు పంపించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

49 నిమిషాల వీడియో క్లిప్పింగ్ ?
మళయాలం నటిపై లైంగిక దాడి జరిగిన సమయంలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ విరామం లేకుండా 49 నిమిషాల పాటు తన మొబైల్ లో వీడియో చిత్రీకరించాడని మళయాలం మీడియాలో ప్రచారం జరిగింది. వీడియో ఉన్న మెమరీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారని తెలిసింది.

పల్సర్ సునీ చేతిలో జాతకాలు !
నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పల్సర్ సునీ చేతిలో ప్రముఖుల జాతకాలు ఉన్నాయని స్థానిక మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పల్సర్ సునీ నోరు విప్పితే అనేక మంది జైల్లో ఊచలు లెక్కపెట్టే సమయం దగ్గర్లోనే ఉందని సమాచారం.

ఆందోళనలో
ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఈ లైంగిక దాడి కేసు మా మెడకు చుట్టుకుంటుందో ? అంటూ హడలిపోతున్నారు. లైంగిక దాడి కేసులో మళయాల చిత్ర రంగ ప్రముఖలు అరెస్టు అయితే వారి సినీ జీవితానికి అక్కడితో బ్రేక్ పడుతోందని కేరళ ప్రజలు అంటున్నారు.

త్వరలో అరెస్టులు చేస్తాం !
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం మేరకు త్వరలో అరెస్టుల పర్వం మొదలు అవుతోందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎవ్వరిని అరెస్టు చేస్తాం అనే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications