హీరోయిన్ ను కారులోనే నలుగురు, వీడియో, కోట్లు ఇవ్వకుంటే నీ పేరు; హీరోకి వార్నింగ్ !

బహూబాష నటిపై జరిగి సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళం స్టార్ హీరో దిలీప్ కు బెదిరింపు ఫోన్లు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరువనంతపురం: బహూబాష నటిపై జరిగి సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళం స్టార్ హీరో దిలీప్ కు బెదిరింపు ఫోన్లు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామూహిక లైంగిక దాడి కేసులో నీ పేరు బయటకు రాకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చెయ్యాలని ఫోన్ చేసి బెదిరించారు.

బహుబాష నటిపై లైంగిక దాడి చేసిన కేసులోని ప్రధాన నిందితుడు పల్సర్ సుని జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న పల్సర్ సుని మీ పేరు చెప్పకుండా ఉండాలంటే మాకు రూ. 1.50 కోట్లు ఇవ్వాలని అతని ప్రాణ స్నేహితుడు విష్ణు హీరో దిలీప్ ను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హీరో క్లోజ్ ఫ్రెండ్, దర్శకుడు

హీరో క్లోజ్ ఫ్రెండ్, దర్శకుడు

బహుబాష నటిపై లైంగిక దాడి కేసులో జైల్లో ఉన్న పల్సర్ సుని స్నేహితుడు విష్ణు ఫోన్ చేసి బెదిరించిన సమయంలో హీరో దిలీప్ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు నాదిర్ షా మొబైల్ లో రికార్డు చేసుకుని ఆ టేపులు పోలీసులకు ఇచ్చాడు, హీరో దిలీప్ తో పాటు దర్శకుడు నాదిర్ షా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ ?

నటి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ ?

ప్రముఖ మలయాళం హీరోయిన్, బహుబాష నటిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారని ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళం హీరో దిలీప్ కు నేరుగా ఫోన్ చేసి రూ. 1.50 కోట్లు డిమాండ్ చెయ్యడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

నాకు సంబంధం లేదు !

నాకు సంబంధం లేదు !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో దిలీప్ అంటున్నాడు. తన సినీ జీవితాన్ని నాశనం చెయ్యడానికి నన్ను టార్గెట్ చేసుకుంటున్నారని దిలీప్ ఆరోపిస్తున్నాడు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని హీరో దిలీప్ తేల్చి చెప్పాడు.

సీబీఐ విచారణకు డిమాండ్

సీబీఐ విచారణకు డిమాండ్

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. మళయాం స్టార్ హీరో దిలీప్ తో పాటు ఓ ప్రముఖ దర్శకుడి పేరు తెరమీదకు రావడంతో కేసు సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేరళ ఎమ్మెల్యే పీటీ. థామస్ డిమాండ్ చేశారు.

కారులోనే రెండు గంటలు లైంగిక దాడి !

కారులోనే రెండు గంటలు లైంగిక దాడి !

2017 పిబ్రవరి 17వ తేదీ రాత్రి షూటింగ్ ముగించుకున్న తరువాత నటి తన కారు డ్రైవర్ తో కలిసి బయలుదేరింది. మార్గం మధ్యలో నటి ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొనింది. తరువాత నటితో గొడవ పెట్టుకున్న నిందితులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు లైంగిక దాడి చేశారని కేసు నమోదు అయ్యింది.

వీడియో తీశాడు

వీడియో తీశాడు

కారులో బహుబాష నటి మీద లైంగిక దాడి జరిగే సమయంలో నిందితుడు పల్సర్ సుని తన మొబైల్ లో ఆ దృశ్యాలు రికార్డు చేశాడు. తరువాత విషయం బయటకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని పల్సర్ సుని నటికి వార్నింగ్ ఇచ్చాడు.

హీరో, దర్శకుడి స్కెచ్ !

హీరో, దర్శకుడి స్కెచ్ !

బహుబాష నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చెయ్యాలని ప్రముఖ మలయాళం హీరో, దర్శకుడు పక్కా ప్లాన్ చేశారని నిందితుడు పల్సర్ సుని అంటున్నాడు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో దిలీప్ అంటున్నాడు.

స్టార్ హీరోయిన్ ను వదిలేసి మరో నటితో !

స్టార్ హీరోయిన్ ను వదిలేసి మరో నటితో !

ప్రముఖ మలయాళం హీరోయిన్ మంజు వారియర్ కు 2014లో విడాకులు ఇచ్చిన దిలీప్ ఇటీవల మరో నటిని వివాహం చేసుకున్నాడు. మంజు వారియర్ కు విడాకులు ఇచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లైంగిక దాడికి గురైన బహుబాష నటితో పాటు ప్రముఖ హీరోయిన్లు సంయుక్త, శ్వేతా, గీతు పూర్ణిమా అండగా నిలిచారు.

పాలిగ్రాఫ్ పరీక్షకు నేను రెడీ

పాలిగ్రాఫ్ పరీక్షకు నేను రెడీ

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ తాను పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్దంగా ఉన్నానని సోమవారం కొచ్చిలో చెప్పారు. తన మీద అనవసరంగా లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

హీరోకు సంబంధం ఉంది

హీరోకు సంబంధం ఉంది

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మలయాళం సినీరంగంలోని ప్రముఖుల హస్తం ఉందని దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ ఆరోపించారు. తన మాజీ భర్త దిలీప్ ఇలా చేయించారని అమె పరోక్షంగా ఆరోపించారు. లైంగిక దాడికి గురైన నటి బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, సినీ నిర్మాతను నిశ్చతార్థం చేసుకుని వివాహం చేసుకోవడానికి సిద్దంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+