Attack: అమెరికాలో భారతీయ నటుడిపై కత్తితో దాడి..

భారతీయ నటుడిపై అమెరికాలో దాడి జరిగింది.

అమెరికాలో భారతీయ నటుడిపై కత్తితో దాడి జరిగింది. అమెరికాలో పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పై గుర్తుతెలియని ఆగంతకులు కత్తితో దాడికి పాల్పడ్డారు. దీంతో అమన్ ధలివాల్ కు గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమన్ ధలివాల్ గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్ నెస్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా దాడి జరిగింది. కొంత మంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి దిగారు.

చుట్టు పక్కల ఉన్నవారు అక్కడికి చేరుకునే వరకే నిందితులు తప్పించుకున్నారు. కింద పడిపోయిన అమన్ ధలివాల్ ను దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే అమన్ ధలివాల్ పై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది తెలియరాలేదు. అయితే అతనిపై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు జిమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Attacked on Indian Actor aman dhaliwal with Knife in America

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమన్ ధలివాల్ పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పంజాబ్ లోని మాన్సాలో అమన్ ధలివాల్ పుట్టారు. ఆయన పలు పంజాబీ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించారు. 2010లో వచ్చిన హృతిక్ రోహషన్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రదారులుగా నటించిన జోదా అక్బర్ చిత్రంలో అమన్ ధలివాల్ ప్రముఖ పాత్ర చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+