నటి కేసులో ట్విస్ట్: అర్ధనగ్న ఫోటోలు తీసి, ప్లాన్ ఇలా...
నటి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏడుగురితో కూడిన ఓ ముఠా బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు లాగాలని నెల క్రితం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కొచ్చి: మలయాళ నటి బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు లాగాలని ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ముఠా నెల రోజుల క్రితం పథకం వేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ కొత్త విషయం తెలిసింది.
భావనను బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు లాగాలని కుట్ర జరిగినట్లు విచారణలో తేలిందని ఎర్నాకులం (రూరల్) జిల్లా పోలీసు చీఫ్ ఎ.వి. జార్జ్ చెప్పారు. అంతకు మించి వివరాలు ఇవ్వలేమని చెప్పారు. భావన డ్రైవర్ మార్టిన్ ఆంటోనీని పోలీసులు శనివారంనాడు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
మొబైల్ ఫోన్స్ ఆధారంగా ఆదివారంనాడు పోలీసులు కోయంబత్తూరులోని రహస్య స్థావరంలో దాక్కున్న అప్పుజాకు చెందిన వడివాల్ సలీంను, కన్నూరుకు చెందిన ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంత డబ్బు అడగాలని....
అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను చూపించి భావన నుంచి రూ.30 లక్షలు లాగాలని ముఠా పథక రచన చేసినట్లు సలీం, ప్రదీప్‌ల మాజీ రూమ్మేట్స్‌రు పల్సర్ సునీ చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. అందుకు వారికి సహాయం చేస్తానని సునీ హామీ కూడా ఇచ్చినట్లు చెప్పాడు.

ఇలా సునీ చెప్పాడు...
కిడ్నాప్‌నకు ఆ ఇద్దరితో సహకరించాలని సునీ తనను అడిగాడని కస్టడిలో ఉన్న ఆంటోనీ చప్పాడు. మార్టిన్‌కు ఆధివారంనాడు కలమ్‌స్సెరీ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఫిబ్రవరి 17వ తేదీన ముఠాలో కలమ్‌స్సెరీ వద్ద చేరాలని సునీ సూచించాడని, వారికి కూడా డబ్బు ఆశ చూపాడని, అయితే సంఘటన జరిగిన తర్వాత అతను వారికి డబ్బులు ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

త్వరలోనే వారిని పట్టుకుంటాం...
కేసులో పరారీలో ఉన్న సుని, మనికందన్, విజీష్‌లను, గుర్తు తెలియని మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వారిపై లుకవుట్ నోటీసులు జారీ చేసినట్లు జార్జ్ చెప్పారు. మూడో పార్టీ ఏదైనా ఈ కుట్రలో దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ రోజు రాత్రి జరిగింది...
త్రిషూరులోని తన ఇంటి నుంచి కొచ్చికి వెళ్తుండగా శుక్రవారం రాత్రి భావనపై దాడి జరిగింది. ప్లాన్ ప్రకారం ఆమె కారులోకి ప్రవేశించి దాదాపు మూడు గంటల పాటు కారులో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సెమీ న్యూడ్ ఫోటోలు తీశారు. వీడియోలు తీశారు. చివరకు పడముఘల్ వద్ద ఆమెను కారులో వదిలేసి, తాము తెచ్చుకున్న టెంపోలో దుండగులు పారిపోయారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications