"కులాంతర వివాహాలపై పంచాయతీల దాడి చట్టవిరుద్ధం"
న్యూఢిల్లీ: వయోజనులైన స్త్రీపురుషులు వివాహం చేసుకుంటే దాన్ని ప్రశ్నించే హక్కు ఖాప్ పంచాయతీలకు గానీ సంఘాలకు గానీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విదమైన జోక్యం, ముఖ్యంగా కులాంతర వివాహాల విషయంలో చట్ట విరుద్ధమవుతుందని తేల్చి చెప్పింది.

ఖాప్ పంచాయతీలను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము ముందుకు రావాల్సి వస్తుందని కూడా అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. సుప్రీంకోర్టు మంగళవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాప్ పంచాయతీల ప్రాబల్యం ఉంది. ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకమని, పరువు హత్యలకు అవి పోత్సహించడం సిగ్గుమాలిన విషయయని, కిరాతకమని సుప్రీంకోర్టు అంతకు ముందు వ్యాఖ్యానించింది.
ఇటువంటి వాటిని అరికట్టంలో విఫలమైన ప్రభుత్వాధికారులకు, పోలీసు అధికారులకు కూడా శిక్ష విధించాలని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications