బెంగళూరులో పట్టపగలు పార్క్ లో మహిళను ఎత్తుకెళ్లాడు, పొదలచాటులో, చివరికి!
బెంగళూరు: బెంగళూరులో పట్టపగలు పబ్లిక్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న మహిళపై కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. పార్క్ లో పొదలలోకి మహిళను ఎత్తుకెళ్లి ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేసిన కామాంధుడికి స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

పగలు 11 గంటలు
పోలీసుల కథనం మేరకు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని జేపీ పార్క్ లో స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ ఫిబ్రవరి 21వ తేదీ పగలు 11 గంటలకు వాకింగ్ చేస్తున్నారు.

కామాంధుడు నిఘా
సర్వసాధారణంగా బెంగళూరులోని పార్క్ ల్లో ఉదయం, సాయంత్రం స్థానికులు ఎక్కువ మంది వాకింగ్ చేస్తుంటారు. పగటిపూట చాల తక్కువ మంది వాకింగ్ చేస్తుంటారు. ఈ విషయం గమనించిన కామాంధుడు శ్యామ్ పార్క్ లో నిఘా వేశాడు.

ఒంటరిగా మహిళ
ఒంటరిగా వాకింగ్ చేస్తున్న మహిళను ఫాలో అయిన శ్యామ్ ఆమెను ఎత్తుకుని పొదలచాటుకు వెళ్లాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఆమె కేకలు వెయ్యడానికి ప్రయత్నిస్తే శ్యామ్ అతని చేతితో ఆమె నోరుమూసిపెట్టాడు.

కామాంధుడి చెయ్యి !
శ్యామ్ నుంచి తప్పించుకోవడానికి విఫలయత్నం చేసిన మహిళ చివరికి అతని చెయ్యిని నోటితో గట్టిగా కొరికి కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు పార్క్ లోకి పరుగుతీసి మహిళను రక్షించి కామాంధుడు శ్యామ్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications