• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజయ్ గోసాలియా హత్యాయత్నం కేసు: ఛోటా రాజన్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా

|

ముంబై: 2013 బూకీ, బిల్డర్ అజయ్ గోసలియా హత్యాయత్నం కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు ముంబై ప్రత్యేక సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులు ఛోటా రాజన్ దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రాజన్ తోపాటు అతనికి సహకరించినవారికి కూడా పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, చోటా రాజన్‌కు కోర్టు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.

జర్నలిస్టు హత్య కేసు: ఛోటా రాజన్‌ సహా దోషులందరికీ జీవిత ఖైదు

ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. 52 ఏళ్ల అజయ్ గోసాలియా అలియాస్ గాండాపై ఆగస్టు 28, 2013 న ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. అతను మలాడ్ (వెస్ట్) లోని ఇన్ఫినిటీ మాల్ నుంచి బయటకు వెళుతుండగా ఈ దాడి జరిగింది. రాజన్ తన విశ్వసనీయ లెఫ్టినెంట్ సతీష్ కాలియాను దాడి చేయమని ఆదేవించడంతో అతడు గోసాలియాపై కాల్పులు జరిపినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆరోపించింది.

Attempted murder case of bookie-turned-builder Ajay Goslia: Chhota Rajan sentenced to 10 years in jail

ఈ కాల్పుల్లో గోసాలియాకు తీవ్రగాయాలైనప్పటికీ.. అతడు మరణం నుంచి తప్పించుకున్నాడు. అతడు ధరించిన భారీ బంగారు ఆభరణాలే బుల్లెట్ గాయాల నుంచి కాపాడాయి. బుల్లెట్లు ఆ ఆభరణాలు తగిలి ప్రాణాపాయం నుంచి తప్పటించుకున్నారని వైద్యులు వెల్లడించారు.

కాగా, ఈ హత్యాయత్నం ఘటనపై బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 2013 ఆగస్టులో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును ముంబై పోలీస్ డీసీబీ సీఐడీకి బదిలీ చేసింది. ఆ తర్వాత ఈ కేనుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్(ఎంకోకా) అప్లై చేశారు. 2013 నవంబర్‌లో ఏడుగురు నిందితులపై ఛార్జీషీటు నమోదు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రకాశ్ నికమ్, సతీష్ కాలియా, చోటా రాజన్ తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి నికమ్, కాలియాలను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ జే డే హత్య కేసులో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. బాలి నుంచి ఇండియాకు రాజన్ ను తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ చేయబడింది. ఏప్రిల్ 21, 2016లో సీబీఐ అతడ్ని కస్టడీకి తీసుకుంది. చివరకు ఛార్జీషీటు కోర్టులో ప్రవేశపెట్టడంతో 8 మంది దోషులకు శిక్ష పడింది.

English summary
Aspecial CBI court in Mumbai has sentenced gangster Chhota Rajan to 10 years in jail in the 2013 case of bookie-turned-builder Ajay Gosalia’s attempted murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X