సన్నీ డియోల్‌కు గుడ్‌న్యూస్: ఆ సమస్య ఎవరంటూ కాంగ్రెస్ చురకలు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్(Sunny Deol)కు చెందిన ముంబైలోని విల్లా వేలానికి ఇచ్చిన నోటీసును బ్యాంక్ ఆఫ్ బరోడా ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా నోటీసు వచ్చిందని.. దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది.
అప్పు తిరిగి చెల్లించని కారణంగా సన్నీ డియోల్‌కి చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆదివారం ఒక ప్రకటన చేసింది. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతోపాటు జుహూలో ఉన్న సన్నీ విల్లాను గ్యారంటీగా చూపించి ఆయన ఈ రుణాన్ని పొందారని తెలిపింది. దాదాపు రూ. 56 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.

ఈ క్రమంలోనే లోన్ రికవరీలో భాగంగా సన్నీ విల్లాను వేలం వేయనున్నట్లు వెల్లడించింది. అంతేగాక, సెప్టెంబర్ 25న ఈ వేలం జరగనుందని బ్యాంక్ వెల్లడించినట్లు మీడియాలో వచ్చిన కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ వ్యవహారం అటు సినీ, ఇటు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, మళ్లీ 24 గంటల్లోనే ఆ నోటీసును ఉపసహరించుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించడం మరో కొత్త చర్చకు దారితీసింది.
బ్యాంక్ వేలం వేసేందుకు వెనక్కి తగ్గడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 56 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు చెందిన జుహూలో ఉన్న విల్లాను ఈ-వేలం వేయనున్నట్లు వచ్చిన వార్తలను అందరం చూశాం. 24 గంటల్లోనే సాంకేతిక సమస్య కారణం చూపుతూ బ్యాంక్ ఆ నోటీసును ఉపసంహరించుకుంది. ఈ సాంకేతిక కారణాల వెనక ఎవరున్నారనేది ఆశ్చర్యంగా ఉందంటూ జైరాం పరోక్ష విమర్శలు చేశారు.
ఇది ఇలావుండగా, సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దీంతో సంబరాల్లో మునిగితేలుతున్నారు సన్నీ డియోల్. 2001లో విడుదలైన గదర్ కు సీక్వెల్‌గా గదర్ 2 రూపొందించారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారాసింగ్ పాత్రలో సన్నీ డియోల్ కనిపించారు. అమీషా పటేల్ కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications