Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aunty: ఇంట్లో బాయ్ ఫ్రెండ్స్ తో కూతురు ఎంజాయ్, అడ్డుపడిన తల్లిని ప్రియులతో చంపించిన కిలాడీ లేడి !

చెన్నై/ తుత్తుకూడి: వివాహం చేసుకున్న దంపతులకు 17 ఏళ్ల వయసు ఉన్న ఓ కూతురు ఉంది. భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భార్య ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తరువాత వాళ్ల కూతురు కూడా బయట తిరగడం మొదలు పెట్టింది. యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఓ యువకుడితో ఆమె చనువు పెంచుకుంది. కొంతకాలం తరువాత వేర్వేరు ఏరియాల్లో ఉన్న మరో ఇద్దరు యువకులతో ఆమె చనువు పెంచుకుని వాళ్లతో తిరగడం మొదలు పెట్టింది. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెలుతున్న తల్లిదండ్రులు రాత్రి ఎప్పుడో ఇంటికి వెలుతున్నారు. రానురాను యువతి ఆమె ప్రియులను ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. ఇంట్లో ప్రశ్నించడానికి పెద్దవాళ్లు లేకపోవడంతో ఆ యువతి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఇటీవల తన ఇంటికి ఎవరెవరో వచ్చి తన కూతురితో కాలం గడుపుతున్నారని తెలుసుకున్న తల్లి మండిపడింది. నువ్వు ఆడదానివి, మగాడిలాగా విచ్చలవిడిగా తయారై బరితెగించి తిరిగితే నేను చూస్తూ ఊరుకోనని తల్లి ఆమె కూతురిని హెచ్చరించింది. తన విలాసాలకు తన తల్లి అడ్డుపడుతోందని రగిలిపోయిన కూతురు ఇద్దరు ప్రియులతో కలిసి కన్న తల్లిని గొంతు కోసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. తల్లిని చంపేసి ప్రియులతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న కూతురి స్కెచ్ రివర్స్ అయ్యింది.

దంపతులకు 17 ఏళ్ల కూతురు

దంపతులకు 17 ఏళ్ల కూతురు


తమిళనాడులోలని తుత్తుకూడి పట్టణంలోని దామోదరనగర్ లో మునిలక్ష్మి, ముత్తుస్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేసిన మునిలక్ష్మి, ముత్తుస్వామి దంపతులకు 17 ఏళ్ల వయసు ఉన్న ఓ కూతురు ఉంది. ముత్తుస్వామి భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మునిలక్ష్మి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

ఏరియాలో ప్రియుడిని సెట్ చేసుకున్న కూతురు

ఏరియాలో ప్రియుడిని సెట్ చేసుకున్న కూతురు

మునిలక్ష్మి, ముత్తుస్వామి దంపతుల కూతురుకు ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు. తల్లిదండ్రులు మునిలక్ష్మి, ముత్తుస్వామి బయటకు వెళ్లిన తరువాత వాళ్ల కూతురు కూడా బయట తిరగడం మొదలు పెట్టింది. యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఓ యువకుడితో ఆమె చనువు పెంచుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

కిలాడీకి ముగ్గురు ప్రియులు

కిలాడీకి ముగ్గురు ప్రియులు


కొంతకాలం తరువాత వేర్వేరు ఏరియాల్లో ఉన్న మరో ఇద్దరు యువకులతో ఆ యువతి చనువు పెంచుకుని వాళ్లతో తిరగడం మొదలు పెట్టింది. ఒకరికి తెలీకుండా ఒకరితో మొత్తం ముగ్గురు ప్రియులతో ఆ యువతి తిరిగి జల్సాలు చేస్తోంది. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెలుతున్న తల్లిదండ్రులు ముత్తుస్వామి, మునిలక్ష్మి రాత్రి ఎప్పుడో ఇంటికి వెలుతున్నారు.

కూతురి మ్యాటర్ తల్లికి చెప్పారు

కూతురి మ్యాటర్ తల్లికి చెప్పారు

రానురాను మునిలక్ష్మి కూతురు ఆమె ప్రియులను ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. విషయం గమనించిన స్థానికులు నీ కూతురు విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టిందని, ఆమె పద్దతి మార్చుకుంటే మీకే మంచిదని, లేదంటే మీ పరువు పోతుందని తెలిసినవాళ్లు మునిలక్ష్మిని హెచ్చరించారు.

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి

తన ఇంటికి ఎవరెవరో వచ్చి తన కూతురితో కాలం గడుపుతున్నారని తెలుసుకున్న మునిలక్ష్మి ఆమె కూతురి మీద మండిపడింది. నువ్వు ఆడదానివి, మగాడిలాగా విచ్చలవిడిగా తయారై బరితెగించి తిరిగితే నేను చూస్తూ ఊరుకోనని, మీ నాన్నకు నీ విషయం చెప్పాల్సి వస్తుందని మునిలక్ష్మి ఆమె కూతురికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ప్రియులతో కలిసి కన్నతల్లిని చంపేసిన కూతురు

ప్రియులతో కలిసి కన్నతల్లిని చంపేసిన కూతురు

తన విలాసాలకు తన తల్లి అడ్డుపడుతోందని రగిలిపోయిన కూతురు ఇద్దరు ప్రియులతో కలిసి ఇంట్లో నిద్రపోతున్న కన్న తల్లి మునిలక్ష్మిని గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. తన ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన తల్లి మునిలక్ష్మిని హత్య చేసి పారిపోయారని కూతురు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

కూతురి స్కెచ్ రివర్స్

కూతురి స్కెచ్ రివర్స్


పోలీసుల విచారణలో మునిలక్ష్మి కూతురు మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. తల్లి మునిలక్ష్మిని చంపేసి ప్రియులతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న కూతురి స్కెచ్ పూర్తిగా రివర్స్ కావడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ముత్తులక్ష్మి కూతురి బాయ్ ఫ్రెండ్స్ కోసం గాలిస్తున్నామని తుత్తుకూడి పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+