Aunty: బయట ఊర్లో భార్య ఉద్యోగం, రాత్రి పీకలదాక తాగేసి అత్తను సిగరేట్లతో కాల్చిన అల్లుడు, క్లేమాక్స్ !
చెన్నై/ తిరుచ్చి: కూతురి జీవితం బాగుండాలని మంచి పెళ్లి సంబంధాల కోసం చూశారు. బంధువులు, తెలిసిన వాళ్లు, బంధువులు చూసిన ఓ యువకుడితో కూతురి పెళ్లి జరిపించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే ప్రేమించిన యువకుడితో ఆ యువతి పెళ్లి చేసుకుంది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు సర్దుకుపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త పనిపాటకు వెళ్లకుండా మద్యం తాగడానికి బానిస అయ్యాడు. ఇంట్లో మూడు సంవత్సరాల కూతురు ఉండటం, భర్త ఏ పనికి వెళ్లకపోవడంతో బాగా చదువుకున్న భార్య ఉద్యోగంలో చేరింది. కూతురిని, భర్తను చూసుకోవడానికి ఆమె తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది, బయట ఊర్లో ఉద్యోగం చేస్తున్న భార్య ప్రతి శనివారం రాత్రి సొంత ఊరికి వెళ్లి భర్త, కూతురు, తల్లితో కలిసి ఉండేది, సోమవారం ఉదయం మళ్లీ ఆమె ఉద్యోగానికి వెలుతోంది. అయితే భార్య దూరం కావడంతో ఇంట్లో ఉన్న అత్త మీద అల్లుడు రగిలిపోయారు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అల్లుడు అత్త మెడ మీద, భుజం మీద సిగరెట్లతో కాల్చేశాడు. అల్లుడు పెట్టే చిత్రహింసలు భరించలేని అత్త పోలీసు కేసు పెట్టడంతో భార్య సంపాదనతో ఇంతకాలం జల్సా చేస్తున్న భర్తకు పోలీసులు చీటీ చింపేశారు.

కూతురి లవ్ స్టోరీ
తమిళనాడులోని తిరుచ్చిలోని తిరువానైకావెల్ ప్రాంతంలో కార్తీక్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తిరుచ్చిలోనే దేవి (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. దేవికి వనితారాణి అనే కూతురు ఉంది. వనితారాణి, కార్తీక్ కు ఆరు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. కార్తీక్, వనితారాణి ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

సర్దుకుపోయిన అమ్మాయి ఫ్యామిలి
కూతురు వనితారాణిని ఆమె కుటుంబ సభ్యులు బాగా చదివించారు. వనితారాణి జీవితం బాగుండాలని మంచి పెళ్లి సంబంధాల కోసం చూశారు. బంధువులు, తెలిసిన వాళ్లు, బంధువులు చూసిన ఓ యువకుడితో వనితారాణి పెళ్లి జరిపించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే ప్రేమించిన యువకుడు కార్తీక్ ను వనితారాణి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. వనితారాణి ప్రేమ వివాహం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు సర్దుకుపోయారు.

జల్సా చేస్తున్న భర్త
ప్రేమ వివాహం చేసుకున్న కార్తీక్, వనితారాణి దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. వనితారాణిని లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె భర్త కార్తీక్ పనిపాటకు వెళ్లకుండా మద్యం తాగడానికి బానిస అయ్యాడు. వనితారాణి పుట్టింటి నుంచి ఇంతకాలం డబ్బులు తీసుకు వచ్చి భర్త కార్తీక్, మూడు సంవత్సరాల వయసు ఉన్న కూతురిని పోషించింది.

ఉద్యోగంలో చేరిన భార్య...... కూతురికి తోడుగా తల్లి
ఇంట్లో మూడు సంవత్సరాల కూతురు ఉండటం, భర్త కార్తీక్ ఏ పనికి వెళ్లకపోవడంతో బాగా చదువుకున్న వనితారాణి కారైకల్ లోని అగరబత్తులు తయారు చేసే కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరింది. కూతురిని, భర్త కార్తీక్ ను చూసుకోవడానికి వనితారాణి తిరుచ్చిలోని ఆమె ఇంట్లో తల్లి దేవిని తెచ్చి ఇంట్లో పెట్టింది,

వారానికి ఒకసారి ఇంటికి వెలుతున్న భార్య
కారైకల్ లో ఉద్యోగం చేస్తున్న వనితారాణి ప్రతి శనివారం రాత్రి తిరుచ్చిలోని ఇంటికి వెళ్లి భర్త కార్తీక్, కూతురు, తల్లి దేవితో కలిసి ఉండేది, సోమవారం ఉదయం వనితారాణి మళ్లీ కారైకల్ లో ఉద్యోగానికి వెలుతోంది. తన భార్య వనితారాణి ఉద్యోగం చెయ్యడం నాకు ఇష్టం లేదని, ఆమెను ఉద్యోగం నిలిపివేయాలని చెప్పాలని ఇంట్లో ఉన్న అత్త దేవితో కార్తీక్ గొడపడుతున్నారు.

అత్తతో గొడవపడుతున్న అల్లుడు
భార్య వనితారాణి దూరం కావడంతో ఇంట్లో ఉన్న అత్త దేవి మీద ఆమె అల్లుడు కార్తీక్ రగిలిపోయారు. ప్రతినిత్యం తనకు మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని అత్త దేవితో కార్తీక్ గొడవపడుతున్నాడు. నా కూతురి సంపాధనతో నువ్వు మద్యం సేవించి జల్సాలు చేస్తున్నావని, నీకు సిగ్గుగా లేదా అంటూ దేవి ఆమె అల్లుడు కార్తీక్ మీద మండిపడింది.

అత్తను సిగరేట్లతో కాల్చిన అల్లుడికి సినిమా
రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అల్లుడు కార్తీక్ అతని అత్త దేవి మెడ మీద, భుజం మీద సిగరెట్లతో కాల్చేశాడు. అల్లుడు కార్తీక్ పెట్టే చిత్రహింసలు భరించలేని అత్త దేవి తిరుచ్చి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. భార్య సంపాదనతో ఇంతకాలం జల్సా చేస్తున్న కార్తీక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని చీటీ చింపేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications