స్టెప్పులతో దుమ్మురేపిన ఆంటీ-అంకుల్ (వీడియో)
కేరళ : మధ్య తరగతి కుటుంబాల్లో అయితే బరాత్ లాంటి డ్యాన్స్ హంగామా, కాస్త పెద్ద కుటుంబాల్లో అయితే సంగీత్ కార్యక్రమాలు ఈరోజుల్లో చాలా కామన్. ఇంటిల్లిపాదీ తమకు నచ్చిన పాటలతో స్టెప్పులేస్తూ.. పెళ్లి వేడుకను మరింత కలర్ ఫుల్ గా మార్చేస్తారు.
అచ్చు ఇదే తరహాలో ఓ మలయాళీ జంట చేసిన డ్యాన్స్ హంగామా ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. కుటుంబ సభ్యులందరి ముందు సరాదా స్టెప్పులతో సంగీత్ కార్యక్రమాన్ని హుషారెత్తించారు సదరు జంట. వయసయిపోయినా..ఏమాత్రం హుషారు తగ్గలేదన్నట్లుగా ఇద్దరూ కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేశారు.
సదరు ఆంటీ, అంకుల్ స్టెప్పులు చూసి పెళ్లికి వచ్చిన బంధువులే కాదు.. ఇంటర్నెట్ లో ఆ వీడియోను వీక్షిస్తోన్న నెటిజెన్స్ సైతం పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.












Click it and Unblock the Notifications