కూతురి మీద ప్రియుడి కన్ను, ఏది లేకుండా చెయ్యాలో అదే చేసిన ఆంటీ !
రాయ్ బరేలి/ ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళకు 19 ఏళ్ల కుమార్తె ఉంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కూతురితో కలిసి నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో డబ్బులు బాగా ఉన్న ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కేటుగాడు ఆమె కూతురి మీద కన్ను వేశాడు. విషయం తెలుసుకున్న ఆంటీ ఆమె ప్రియుడికి దేనితో అయితే కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడో అదే లేకుండా చెయ్యడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో మెహంది లాల్ అలియాస్ లాల్ సాబ్ (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మెహంది లాల్ నివాసం ఉంటున్న ఏరియాలోనే 46 ఏళ్ల స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. స్వప్నా ఆంటీకి 19 ఏళ్ల కుమార్తె ఉంది. భర్తతో విభేదాలు రావడంతో అతనికి దూరంగా కూతురితో కలిసి స్వప్నా నివాసం ఉంటోంది.

మెహంది లాల్, స్వప్నా ఒకే ప్రాంతంలో ఉండటంతో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరికి పరిచయం అయ్యింది. స్వప్నాకు భర్త లేకపోవడంతో ఆమె ఆర్థిక అవసరాలు తీరుస్తున్న మెహంది లాల్ ఆమెను లొంగదీసుకున్నాడు. స్వప్నాకు డబ్బు అవసరం కావడం, ముసలోడు అయిన మెహంది లాల్ కు కామం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరి అవసరాలు వాళ్లు తీర్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
నేరుగా స్వప్నా ఇంటికే వెలుతున్న మెహంది లాల్ అతని కోరికలు తీర్చుకుంటున్నాడు. వయసు మీద పడిన ముసలోడికి అన్ని రకాలుగా స్వర్గం చూపిస్తున్న స్వప్నా ఆమె అవసరాలు తీర్చుకుంటున్నది. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉంటున్న మెహంది లాల్ అతని ప్రియురాలి కూతురి మీద కన్ను వేశాడు.
స్వప్నా ఇంట్లో లేని సమయంలో ఆమె కూతురిని పట్టుకుని ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న మెహంది లాల్ ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రియురాలి కూతురి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని తెలిసింది. చివరికి తల్లి ప్రియుడితో విసిగిపోయిన యువతి మెహంది లాల్ ఆగడాలను తల్లి స్వప్నాకు చెప్పింది.
తనతో శారీరక సంబంధం పెట్టుకున్న మెహంది లాల్ తన కూతురి మీద కన్ను వేశాడని తెలుసుకున్న స్వప్నా రగిలిపోయింది. ఆగస్టు 20వ తేదీ రాత్రి మద్యం సేవించిన మెహంది లాల్ ప్రియురాలు స్వప్నా ఇంటికి వెళ్లాడు. అప్పటికే మరో లిక్కర్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టిన స్వప్నా మందు గ్లాస్ లో పోసి అందులో నిద్రమాత్రలు కలిసి ఇంటికి వచ్చిన ప్రియుడు మెహంది లాల్ కు ఇచ్చింది.

నిద్రమాత్రలు కలిపిన మద్యం సేవించిన మెహంది లాల్ బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. తరువాత మెహంది లాల్ తో రొమాన్స్ చేస్తునట్లు అతని ప్రియురాలు చాలా సేసు కాలం గడిపింది. మెహంది లాల్ నిద్రమత్తులోకి జారుకోవడంతో స్వప్నా బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి కత్తి తీసుకుని వెళ్లి ప్రియుడు మెహంది లాల్ మర్మాంగం కోసేసింది.
దీని కోసమేనా నా కూతురితో ఆడుకుంటావా అంటూ మెహంది లాల్ మర్మాంగం పూర్తిగా కోసేసి అతని చంపేసింది. తరువాత కూతురి సహాయంతో మెహంది లాల్ శవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకుని నిర్జనప్రదేశంలో విసిరేసి తల్లీ, కూతురు ఇద్దరూ పరారైనారు.
మెహంది లాల్ హత్య కేసులో శుక్రవారం అతని ప్రియురాలితో పాటు ఆమె కూతురిని అరెస్టు చేశామని రాయ్ బరేలి ఎస్పీ అలోక్ ప్రియదర్శి స్థానిక మీడియాకు చెప్పారు. మెహంది లాల్ మర్మాంగం కోసేసి అతన్ని హత్య చేసిందని అతని ప్రియురాలు అని, తల్లీకూతురు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని రాయ్ బరేలి ఎస్పీ అలోక్ ప్రియదర్శి స్థానిక మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications