Aunty: భర్తకు దూరం, హత్య కేసులో జైలుకు, లేడీకి బెయిల్, కారులో వచ్చి ఒంటరిగా ఉంటే చంపేసి ఎస్కేప్ !
బెంగళూరు/ హాసన్: భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఒంటరిగా ఉంటున్నది. గతంలో జరిగిన సుపారి హత్య కేసులో ఆమె ఇంతకు ముందే జైలుకు వెళ్లింది. జైలు జీవితం గడిపిన మహిళ బెయిల్ మీద బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన మహిళ సొంత గ్రామంలో ఒంటరిగా ఉంటున్నది. మహిళ ఇంటికి అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి వెలుతున్నారని సమాచారం. రాత్రి మహిళ ఇంటిలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో కారులో వెళ్లిన నలుగురు వ్యక్తులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఏమి జరిగిందో ఏమో తెలీదు కాని కత్తులతో ఆమెను దారుణంగా చంపేసిన నిందితులు వచ్చిన కారులోనే అక్కడి నుంచి దర్జాగా పరారైనారు. రెండు గంటల తరువాత విషయం గుర్తించిన బంధువులు, స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడం కలకలం రేపింది. అయితే తెలిసిన వారే ఈమెను పక్కాప్లాన్ తో హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

భర్తకు దూరంగా ఉంటున్న భార్య
కర్ణాటకలోని హాసన్ పట్టణం సమీపంలోని హనుమంతపురలో గౌరమ్మ అలియాస్ గౌరి (53) అనే మహిళ నివాసం ఉంటున్నది. గౌరి పిల్లలకు వివాహాలు జరిగిపోయాయి. గౌరి కూతురు ఆమె భర్తతో, కొడుకు అతని భార్యతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భర్తను వదిలేసిన గౌరి ఒంటరిగా నివాసం ఉంటున్నది.

హత్యకేసులో జైలుకు వెళ్లింది
భర్తకు దూరంగా ఉంటున్న గౌరి ఒంటరిగానే చాలా కాలం నుంచి ఇంట్లో ఉంటున్నది. గతంలో జరిగిన ఓ సుపారి హత్య కేసులో గౌరి జైలుకు వెళ్లింది. తరువాత బంధువులు బెయిల్ ఇవ్వడంతో జైలు జీవితం గడిపిన గౌరి తరువాత బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన గౌరి ప్రస్తుతం సొంత గ్రామంలోనే ఉంటున్నది.

రాత్రి కారులో వచ్చి చంపేశారు
గౌరి ఇంటికి అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి వెలుతున్నారని సమాచారం. గురువారం రాత్రి గౌరి ఇంటిలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో కారులో వెళ్లిన నలుగురు వ్యక్తులు గౌరి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఏమి జరిగిందో ఏమో తెలీదు కాని కత్తులతో గౌరిని దారుణంగా చంపేసిన నిందితులు వచ్చిన కారులోనే అక్కడి నుంచి దర్జాగా పరారైనారు.

రెండు గంటల తరువాత షాక్
గౌరి హత్యకు గురైన రెండు గంటల తరువాత ఆమె ఇంటికి బంధువులు వెళ్లారు. గౌరి రక్తపు మడుగులో పడి ఉండటం, ఆమె హత్యకు గురైన విషయం గుర్తించిన బంధువులు, స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న హాసన్ జిల్లా ఎస్పీ శ్రీనివాస గౌడ, ఏఎస్పీ నందిని తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

అక్రమ సంబంధమా ?, పాత కక్షలా
గౌరి ఇంటికి కారులో వచ్చిన వారిని తాము ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారని హాసన్ గ్రామీణ పోలీసులు చెప్పారు. గతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి గౌరి హత్యకు గురైయ్యిందా ?, ఆమెకు అక్రమ సంబంధం ఏమైనా ఉందా ? అనే విషయం కచ్చితంగా తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఒంటరిగా నివాసం ఉంటున్న గౌరీ హత్యకు గురి కావడంతో హాసన్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications