ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్: స్పెయిన్ బుల్ ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో గెలిచి స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ సరికొత్త రికార్డును సృష్టించాడు. జకోవిచ్, రోజర్ ఫెదరర్ లను దాటేసి టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ లను కైవసం చేసుకున్న ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో నాదల్ గ్రాండ్‌స్లాంల సంఖ్య 21కి చేరింది. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచాడు.
రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదెవ్ సీనియర్ ఆటగాడైన నాదల్ ముందు ఫైనల్లో నిలవలేకయాడు. ఆఖరి సెట్ వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రాఫెల్ నాదల్ విజయం సాధించాడు. దీంతో నాదల్ కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్ స్లామ్ గెలుచుకోవడం విశేషం.

తొలి రెండు సెట్లను కోల్పోయిన రాఫెల్ నాదల్.. తర్వాత తన అనుభవంతో కూడిన ఆటతో మెద్వెదెవ్‌పై సునాయస విజయం సాధించాడు. తొలి సెట్‌ను మెద్వెదెవ్ దూకుడుగా ఆడి 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్లో నాదల్ తీవ్రంగా పోరాడి 6-7 తేడాతో కోల్పోయాడు. ఆ తర్వాత వరుస సెట్లలో నాదల్ విజయం సాధించాడు.
Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes.
— #AusOpen (@AustralianOpen) January 30, 2022
⁰
🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r
తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో 6-4, 6-4, 7-5 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లను గెలవడంతో మ్యాచ్ ఐదో సెట్ వరకు వెళ్లింది. మెద్వెదెవ్ సీనియర్ ఆటగాడు నాదల్ తో హోరాహోరీ పోటీపడ్డాడు. దీంతో నాదల్ విజయం కోసం కొంత శ్రమించకతప్పలేదు. నాదల్ తో మెద్వెదెవ్ ఐదుసార్లు తలపడగా..ఒక్కసారి మాత్రమే విజయం సాధించాడు.












Click it and Unblock the Notifications