ఆస్ట్రేలియా వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి హత్యాయత్నం, మద్యం మత్తులో హంగామా, ఐసీయులో !
బెంగళూరు: భారతదేశంలో పర్యటనకు వచ్చిన విదేశీయుడిపై స్థానికులు హత్యాయత్నం చేసిన ఘటన కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లా బాదామి సమీపంలో జరిగింది. స్థానికుల చేతిలో తీవ్రగాయాలైన ఆస్ట్రేలియాకు చెందిన విలియమ్స్ (35) అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. మద్యం మత్తులో ఉన్న విలియమ్స్ కాళ్లు, చేతులు కట్టేసి దాడి చెయ్యడంతో అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని, ఎవరు దాడి చేశారు ? అనే విషయం తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

కాళ్లు, చేతులు కట్టేసి !
విలియమ్స్ కాళ్లు చేతులు కట్టేసి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూసిన సమయంలో విలియమ్స్ కాళ్లు, చేతులు కట్టేసి స్థితిలోనే ఉంది. వెంటనే అతన్ని బాగల్ కోటేలోని కుమారేశ్వర ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

బాదామిలో పురాతన కట్టడాలు
విలియమ్స్ ఆస్ట్రేలియాలోని మెల్టర్న్ నగరానికి చెందిన వ్యక్తి అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, బాదామిలోని పురాతన కట్టడాలను వీక్షించడానికి విలియమ్స్ బాదామికి వచ్చారని పోలీసులు అంటున్నారు. విలియమ్స్ మీద స్థానికులు దాడి చేసిన సమయంలో అతనికి సంబంధించిన వాళ్లు ఎవ్వరూ లేరని తెలిసింది.

మద్యం మత్తులో హంగామా
సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాదామికి 17 కిలోమీటర్ల దూరంలోని కోంకెణకోప్ప గ్రామం సమీపంలో మద్యం సేవించిన విలియమ్స్ నడుచుకుంటూ వెళ్లిన విషయం స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న విలియమ్స్ స్థానికుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వారిని దూషించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పసి పిల్లల దొంగ ?
స్థానికులు విలియమ్స్ ప్రశ్నించారని, అయితే అతనికి కన్నడ బాష రాకపోవడం, స్థానికులకు ఇంగ్లీష్ రాకపోవడంతో సమస్య ఎదురైయ్యిందని పోలీసులు అన్నారు. పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడనే అనుమానంతో స్థానికులు విలియమ్స్ ను పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఏ లాడ్జ్ లో ఉన్నారు !
బాదామిలోని అన్ని లాడ్జ్ లు, హోటళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన విలియమ్స్ అనే పేరు మీద ఎలాంటి గది బుక్ చెయ్యలేదని, బాగల్ కోటేలోని లాడ్జ్ లు, హోటళ్ల సిబ్బందిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు. విలియమ్స్ ను ఇష్టం వచ్చినట్లు చితకబాదడంతో అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని, అతని బ్యాగ్ లోని వివరాల ఆదారంగా ఆస్ట్రేలియాలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. అయితే విలియమ్స్ మీద ఎవరు దాడి చేశారు ? అనే విషయం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications