ఈ డ్రెస్సెంటీ?: యువతికి క్లాస్ పీకిన ఆటో డ్రైవర్(వీడియో)
బెంగళూరు: నగరానికి చెందని ఓ ఆటో డ్రైవర్ ఓ యువతికి క్లాస్ పీకి షాకిచ్చాడు. పొట్టి దుస్తులు వేసుకోవడాన్ని అతడు ఆక్షేపించాడు. ఇలాంటి దుస్తులు వేసుకుని బయట తిరగడమేంటని ప్రశ్నించాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
ఏప్రిల్ 24న బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ యువతి ఆటో డ్రైవర్ ఫొటో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐశ్వర్య సుబ్రహ్మణ్యన్ అనే ఆ యువతి జరిగిన విషయాన్నంతా రాసి పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.

ఆటో దిగి డబ్బు చెల్లిస్తున్న సమయంలో 'ఏమీ అనుకోవద్దు. మీరు వేసుకున్న దుస్తులు సరిగ్గా లేవు. పొట్టి దుస్తులు కాకుండా పూర్తిగా వేసుకోండి' అని ఆ యువతికి ఆటో డ్రైవర్ చెప్పాడు.
మోకాళ్ల కింది వరకు ఉండే దుస్తులు వేసుకోవాలని సూచించాడు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని నీతిమాలిన దానిలా ఉండొద్దన్నాడు. తను చెప్పింది సరైందేనని వ్యాఖ్యానించాడు. అంతేగాక, తన ఫొటోను తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోమని సెలవిచ్చాడు.
శ్రీకాంత్ అనే ఆ డ్రైవర్ తన వ్యాఖ్యలకు మద్దతు వస్తుందని అలా చేయమన్నాడని సదరు యువతి తెలిపింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆ ఆటో డ్రైవర్, అతని ఆటో ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications