ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. ఒకే ముహుర్తానికి ప్రియున్ని పెళ్లాడిన యువతులు..
తిరుపూర్ : అతనో ఆటోడ్రైవర్. ఒకరికి తెలియకుండా మరొకరితో ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం కాస్తా ఆ ఇద్దరు ప్రియురాళ్లకు తెలియడంతో ప్రేమికున్ని నిలదీశారు. వాళ్లను వదిలించుకునే ప్రయత్నం చేసిన ఆ కేటుగాడికి బుద్ధి చెప్పాలని డిసైడయ్యారు. ఒకే ముహుర్తానికి ఇద్దరూ తాళి కట్టించుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ
తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ధారాపురం పుదుకోట్టెమేడుకు చెందిన ఓ యువకుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త చనిపోవడంతో సదరు ఆటోడ్రైవర్‌కు పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. అదే సమయంలో ఆ కేటుగాడు మరో 19ఏళ్ల యువతిని తన ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు గుట్టుగా ప్రేమ వ్యవహారం నడిపాడు.

పెళ్లికి పట్టుబట్టిన ప్రియురాళ్లు
ఇద్దరు ప్రియురాళ్లతో ప్రేమ వ్యవహారం కొన్నాళ్ల పాటు సజావుగానే సాగింది. అయితే ఒక రోజున ప్రియుడి అసలు రూపం ఇద్దరు యువతులకు తెలిసింది. మొదట వారిద్దరూ గొడవపడ్డారు. ఆ తర్వాత తమను నమ్మించి వంచించిన ప్రియుణ్ని నిలదీశారు. దీంతో సదరు ప్రబుద్ధుడు ప్రియురాళ్లిద్దరినీ వదిలించుకునే ప్రయత్నం చేశాడు. విషయం గ్రహించిన యువతులిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఒకే ముహుర్తాన ఇద్దరూ ప్రియు్ని పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు.

ఇద్దరు ప్రియురాళ్లతో పెళ్లి
తంతే బూరెల గంపలోపడ్డట్లు ఇద్దరు యువతులు పెళ్లికి సిద్ధమవడంతో ఆ ఆటో డ్రైవర్ ఎగిరి గంతేశాడు. మే 29న ఆ ఇద్దరు యువతులను తీసుకుని ఇంట్లోంచి పారిపోయాడు. పళనిలోని ఓ ఆలయంతో ఇద్దరు ప్రియురాళ్ల మెడలో తాళి కట్టాడు. అనంతరం పళని నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు బస్ స్టేషన్‌లో నిల్చుని ఉండగా పోలీసులకు అతన్ని పట్టుకున్నారు. 19 ఏళ్ల యువతి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.

తలలు పట్టుకున్న పోలీసులు
పోలీసులు యువతితో పాటు ఆటో డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా... 25ఏళ్ల యువతి అడ్డుపడింది. వారితో పాటు తనను వెంట తీసుకెళ్లాలని పట్టుబట్టింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ముగ్గురిని స్టేషన్‌కు తరలించి వారి వారి కుటుంబసభ్యులను పిలిపించారు. అసలు విషయం తెలుసుకుని వారు లబోదిబోమన్నారు. ఇద్దరు యువతులకు ఎంత నచ్చజెప్పినా ఆటోడ్రైవర్‌తోనే కలిసి ఉంటామని పట్టుబట్టారు. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగున్ని ఇంటికి పంపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications