Nurse: నర్సు కిడ్నాప్, నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి ఏం చేశాడంటే ?, వన్ సైడ్, రివైంజ్ !
చెన్నై/మదురై: నర్సింగ్ పూర్తి చేసిన యువతి ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు యువతి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. నర్సుగా ఉద్యోగం చేస్తున్న యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నాడు. యువకుడిది వన్ సైడ్ లవ్. యువతి మాత్రం నేను నిన్ను ప్రేమించలేనని, కుటుంబ సభ్యుు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఆ యువకుడు ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. నర్సును ప్రేమిస్తున్న యువకుడు ఆటో డ్రైవర్. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లాలని యువతి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది. ఆ సందర్బంలో ఆటో డ్రైవర్ యువతిని కిడ్నాప్ చేసి ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

ఆసుపత్రిలో నర్సు
తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలోని తిరుకోవిల్ లోని మునిసిపల్ కాలనీలో రాధా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. నర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసిన రాధా తిరుకోవిల్ పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు రాధా ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

వెంటపడిన ఆటో డ్రైవర్
రాధా నర్సుగా ఉద్యోగం చేస్తు సంతోషంగా జీవిస్తోంది. రాధాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నర్సుగా ఉద్యోగం చేస్తున్న రాధాను తిరువణ్ణామలై జిల్లాలోని కిలిపెన్నుత్తూరు సమీపంలోని మదురం ప్రాంతంలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ (24) అనే యువకుడు ప్రేమిస్తున్నాడు.

నో చెప్పిన నర్సు
విజయ్ కుమార్ ది వన్ సైడ్ లవ్. విజయ్ కుమార్ ను నర్సు రాధా ప్రేమించలేదని తెలిసింది. ఇప్పటికే వివాహం చేసుకున్న విజయ్ కుమార్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను నిన్ను ప్రేమించలేనని, నీకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, మా కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని నర్సు రాధా ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ కు చెప్పింది.

నర్సును కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం
పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కుమార్ నర్సు రాధా వెంటపడుతూనే ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో పని ముగించుకున్న రాధా ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది. ఆ సందర్బంలో విజయ్ కుమార్ ఆటో ఎక్కింది. రాధాను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యకుండా వేగంగా ఊరి బయటకు వెళ్లిపోయాడు.

ఆటో డ్రైవర్ కథ ?
ఆటో నిర్జనప్రదేశంలో నిలిపిన విజయ్ కుమార్ నర్సు రాధా మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. గట్టిగా కేకలు వేసిన రాధా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. నర్సు రాధా ఇంటికి వెళ్లి తరువాత కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విజయ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications